భూసేకరణ- పరిహారం అంశంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై మరింత స్పష్టత అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రశ్నలపై చర్చించాల్సి ఉందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
" ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకున్నా పరిహారం చెల్లించకపోయినా భూసేకరణ అమలులో ఉంటుందని ధర్మాసనం చెప్పింది. ఇలా ఎంతకాలం ఉంటుంది? అప్పుడు యజమాని నష్టపోతారు కదా!" ఇలాంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ బొబ్డే వ్యాఖ్యానించారు.
జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్‌లతో సంప్రదించి రెండు వారాల తరువాత ఓ నిర్ణయానికి వస్తామన్నారు జస్టిస్ బొబ్డే.
2014 జనవరి 1 కన్నా ముందు ప్రక్రియ పూర్తయిన భూసేకరణలో 2013 చట్టం ప్రకారం యజమానులను న్యాయపరమైన పరిహారం అందించటం సాధ్యపడదని ఈ ఏడాది మార్చి 6న రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అంతేకాకుండా చట్టంలోని సెక్షన్ 24కు సంబంధించి సుప్రీంకోర్టులోనే రెండు భిన్న తీర్పులు వెలువడ్డాయి.
ఇదీ చూడండి: 'ఆ చట్టాల్ని తిప్పికొట్టేలా చట్టాలు చేయండి'