పశుగ్రాసం కుంభకోణంలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని, ఆందోళన కలిగించే సమస్యలేవీ లేవని ఝార్ఖండ్ జైళ్ల విభాగం శనివారం ప్రకటించింది.
లాలూ కిడ్నీలు 25శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయంటూ రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు చెందిన వైద్యుడు అనధికార ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఆ ప్రకటన చేసిన వైద్యునికి రిమ్స్ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
లాలూ కొన్నాళ్లుగా అనారోగ్య కారణాలతో రిమ్స్ ఆసుపత్రిలోని ఓ వార్డులో ఉంటున్నారు.
ఇదీ చదవండి: క్షీణించిన లాలూ ఆరోగ్యం.. కిడ్నీ సమస్య తీవ్రం