ETV Bharat / bharat

భారత్​ భేరి: అగ్రనేత అంతరంగం ఏంటి...? - లోక్​సక్ష

ఎల్.​కె.అడ్వాణీ... భాజపా అగ్రనేత. మాజీ ఉపప్రధాని. మాజీ ప్రధాని వాజ్​పేయీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి నేత... లోక్​సభ ఎన్నికలు వచ్చినా బయటకు రావడం లేదు. ఎందుకలా? ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? భాజపా ఏమంటోంది?

లాల్​కృష్ణ అడ్వాణీ
author img

By

Published : Mar 21, 2019, 8:22 AM IST

భాజపా అగ్రనేత అడ్వాణీ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా..?
సార్వత్రిక సమరం హోరాహోరీగా జరుగుతోంది. అధికార, విపక్షాల వ్యూహప్రతివ్యూహాలు, పరస్పర విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. ఇంత జరుగుతున్నా.... భాజపా అగ్రనేత లాల్​ కృష్ణ అడ్వాణీ మౌనంగా ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్​సభ ఎన్నికల్లో పెద్దాయన పోటీ చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశమైంది.

"గాంధీనగర్​ స్థానం నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అక్కడి నుంచి జాతీయ నాయకులు పోటీ చేయాలని వారు కోరుకుంటున్నారు"

-- గాంధీ నగర్​ భాజపా వ్యవహారాల పర్యవేక్షకుడు నిమబెన్​ ఆచార్య

అక్కడి నుంచే 6 సార్లు...

గుజరాత్​లోని గాంధీనగర్​ లోక్​సభ స్థానం నుంచి 6 సార్లు గెలుపొందారు అడ్వాణీ. మొదట 1991లో అక్కడి నుంచి విజయం సాధించారు. బాబ్రీ కేసు కారణంగా 1996లో పోటీ చేయలేదు. అప్పుడు మాజీ ప్రధాని వాజ్​పేయీ అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గాంధీ నగర్​ నుంచి జయకేతనం ఎగురవేశారు అడ్వాణీ.

"ఆయన(అడ్వాణీ) ఇంకా నిర్ణయించుకోలేదు. పోటీ చేయాలని పార్టీ కోరినప్పుడు ఆలోచిస్తారు"
-- ఎల్​కే అడ్వాణీ వ్యక్తిగత కార్యదర్శి

భాజపాను వెలుగులోకి తెచ్చిన నేత

అయోధ్యలో రామమందిరం కోసం 1992లో అడ్వాణీ రథయాత్ర చేపట్టారు. అది దేశ రాజకీయాలను మలుపు తిప్పింది. భాజపాకు విశేష మద్దతు తెచ్చిపెట్టింది. ఆయన చేసిన రామజన్మభూమి ఉద్యమం కమలదళాన్ని అధికార పీఠం వైపు నడిపించింది.

అడ్వాణీ, వాజ్​పేయీ కృషితో తొలిసారి 1996లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బలం నిరూపించుకోలేక 13రోజుల్లోనే పడిపోయింది. 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ అధిక స్థానాలు భాజపావే. అప్పుడు మిగిలిన పార్టీలను కూడగట్టి... ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అడ్వాణీది కీలకపాత్ర. అలా ఏర్పాటైన వాజ్​పేయీ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారు అడ్వాణీ. పార్టీని అన్నీ తానై నడిపారు.

మోదీ రాకతో...

2014లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పరిస్థితి మారింది. అడ్వాణీ మౌనంగానే ఉంటున్నారు. ఆయన నేతృత్వంలో పార్టీ మార్గనిర్దేశక బృందాన్ని ఏర్పాటైంది. కానీ ఆ బృందం ఇప్పటి వరకు ఒక్కసారీ సమావేశం కాలేదు.

పార్టీలో భిన్నస్వరాలు

ఎల్​.కె.అడ్వాణీ వయసు 91 ఏళ్లు. అభ్యర్థుల వయో పరిమితిపై పార్టీ కేంద్ర కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నది భాజపా నేతల మాట. వయసు పెరిగిన రీత్యా పోటీ చేయాలో లేదో అనే నిర్ణయాన్ని అడ్వాణీకే వదిలేయాలని పార్టీలోని ఓ వర్గం వాదన. అడ్వాణీ మాత్రం పోటీ చేస్తానని ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు.

" అడ్వాణీతో పోటీ చేయించాలా లేదా అన్నది మా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది"

-- భరత్​ పాండ్య, గుజరాత్​ భాజపా అధికార ప్రతినిధి

అడ్వాణీ స్థానంలో అమిత్​షా?

అడ్వాణీ తిరుగులేని విజయాలు సాధించిన గాంధీనగర్​ లోక్​సభ స్థానాన్ని ఈసారి భాజపా అధ్యక్షుడు అమిత్​షాకు ఇవ్వాలన్నది పార్టీలోని కొందరు నేతల ఆకాంక్ష.

"భాజపా అధ్యక్షుడు అమిత్​ షా గాంధీనగర్​ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు"

-- భాజపా ఎమ్మెల్యే కిశోర్​ చౌహాన్​

SHOTLIST:
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
ARCHIVE: Los Angeles, 23 February 2019
1. Medium of Felicity Huffman on red carpet
ASSOCIATED PRESS
ARCHIVE: Los Angeles, 16 April 2018
2. Eva Longoria poses with Felicity Huffman, Anna Faris and Ricky Martin
ASSOCIATED PRESS
ARCHIVE: New York, 13 May 2014
3. Various of Felicity Huffman and Timothy Hutton talking to reporter on carpet
ASSOCIATED PRESS
ARCHIVE: Los Angeles, 7 March 2012
4. Close up, pull out to wide of William Macy and Felicity Huffman unveiling Huffman's Hollywood star
5. Mid shot of William Macy, Felicity Huffman and their two daughters
HFPA POOL
ARCHIVE: Beverly Hills, California, 6 January 2019
6. Various of William H. Macy and Lori Loughlin on the red carpet of the Golden Globes
ASSOCIATED PRESS
ARCHIVE: Los Angeles, 25 August 2014
7. Various of William H. Macy and Lori Loughlin on the red carpet of the Emmys
STORYLINE:
HUFFMAN'S COURT DATE PUSHED BACK IN ADMISSIONS SCAM CASE
  
A judge has granted a request to push back actress Felicity Huffman's court appearance in Boston on charges that she participated in a college admissions cheating scam.
  
Huffman was initially scheduled to appear in Boston federal court on 29 MARCH along with fellow actress Lori Loughlin and other parents. But a judge on Wednesday (20 MARCH 2019) moved Huffman's hearing to April 3. Huffman's Boston lawyer requested the delay, saying he would be out of town.
  
Huffman was among 50 people charged in the scheme in which wealthy parents allegedly bribed college coaches and other insiders to get their children into some of the nation's most selective schools.
  
Huffman is accused of paying $15,000 that she disguised as a charitable donation so that her daughter could take part in the entrance-exam cheating scam.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.