ETV Bharat / bharat

ప్రభుత్వ నిఘా నడుమ ఘనంగా 'అట్టుకల్' వేడుకలు

తిరువనంతపురం అట్టుకల్​ దేవీపై మహిళల భక్తి ముందు కరోనా ప్రభావం చూపలేకపోయింది. ఆసియాలోనే అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొనే వేడుకగా ప్రసిద్ధికెక్కిన ఈ అట్టుకల్​ ఈ సారీ ఘనంగా ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం విధించిన ఆంక్షల నడుమనే.. భారీ సంఖ్యలో తరలివచ్చారు మహిళా భక్తులు. అంతే కాదు, రోడ్డుపైనే పొంగళ్లు వండేసి అట్టుకల్​తల్లికి సమర్పించేశారు.

Thousands offered Pongala at Attukal Devi Temple
ప్రభుత్వ నిఘా నడుమ ఘనంగా 'అట్టుకల్' వేడుకలుప్రభుత్వ నిఘా నడుమ ఘనంగా 'అట్టుకల్' వేడుకలు
author img

By

Published : Mar 9, 2020, 2:22 PM IST

Updated : Mar 9, 2020, 7:46 PM IST

ప్రభుత్వ నిఘా నడుమ ఘనంగా 'అట్టుకల్' వేడుకలు

తిరువనంతపురం అట్టుకల్​ దేవీ క్షేత్రంలో పొంగళ్లు వండి సమర్పించేశారు మహిళలు. కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన మార్గదర్శకాల మధ్య.. భారీ సంఖ్యలో రాజధానికి తరలివచ్చి భక్తిని చాటుతున్నారు.

రోడ్డుకు ఇరువైపులా దాదాపు 10 కిలోమీటర్ల మేర మహిళలు కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 32 వార్డులు నిండిపోయిన మహిళలు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు వండేశారు. ఒక్కొక్కరిగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తూ.. మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఉదయం 10.20 గంటల ప్రాంతంలో అట్టుకల్​ దేవీ ఆలయ తంత్రి.. ప్రధానపూజారికి అఖండ జ్వాలను అందించారు. జ్వాలా కాగడతో తిడపల్లి, అడుప్పులో జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు పూజారి. ఇక యువకులంతా ఉత్సాహంగా పాల్గొనే కుతియొట్టం ఘట్టం ఈ రాత్రికే జరగనుంది.

అడ్డొచ్చిన కరోనా

ఈ అట్టుకల్​ అమ్మవారి దేవాలయాన్ని మహిళా శబరిమలైగా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రధాన పూజలు, అర్చనల్లో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఈస్ట్​ ఫోర్ట్​ ప్రాంతంలో ఈ క్షేత్రం నెలకొంది. ఇక్కడ జరిగే అట్టుకల్​ పొంగల్​ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కేవలం మహిళలు మాత్రమే లక్షల సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొంటారు.

కొన్ని నెలల ముందు నుంచే ఈ పండుగకు ఏర్పాట్లు జరిగాయి. అయితే కరోనా వ్యాప్తి, కొత్తగా ఐదు వైరస్​ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పండుగ నిర్వహణకు ప్రభుత్వం చాలా ఆలోచించింది. ఎట్టకేలకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. వేడుకలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ.

పండుగ ప్రత్యేకత...

ఆసియాలోనే స్త్రీలు మాత్రమే అత్యధిక సంఖ్యలో పాల్గొనే ఏకైక వేడుక అట్టుకల్​. అట్టుకల్​ భగవతి అమ్మవారి చరిత్ర కేరళ, తమిళనాడుకు చెందిన పురాణగాథల్లో కనిపిస్తుంది. సరస్వతి, మహాలక్ష్మీ, పార్వతిల సమ్మిళిత రూపం ఆమెది. ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.

పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారి కీర్తనలు, భజనలు మార్మోగుతాయి. తొమ్మిదో రోజున అట్టుకల్​ పొంగల్​ జరుగుతుంది. వేకువజామునే మహిళలు ఆలయానికి చేరుకొని కట్టెలపొయ్యిలపై పొంగళ్లు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.
ఇదీ చదవండి:'చపాతీ' ఆమె జీవితాన్నే మార్చేసింది!

Last Updated : Mar 9, 2020, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.