ETV Bharat / bharat

కన్న బిడ్డను చూడకుండానే యోధుడి వీర మరణం

author img

By

Published : Jun 18, 2020, 10:05 AM IST

ఝార్ఖండ్​కు చెందిన కుందన్​ కుమార్​.. గాల్వన్​ లోయ హింసాత్మక ఘటనలో అమరులయ్యారు. అయితే ఆయన భార్య ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సెలవు దొరికిన వెంటనే వచ్చి తన బిడ్డను చూస్తానని ఆయన ఇచ్చిన హామీ.. ఎప్పటికీ నెరవేరకుండా మిగిలిపోయింది.

Ladakh clash: The soldier who will never return home to see his newborn
కన్న బిడ్డను చూడకుండానే యోధుడి వీర మరణం

దేశ సేవలో ప్రాణాలు కోల్పోవడం.. సైనికులకు గర్వకారణం. కానీ వారి కుటుంబ సభ్యులది వేరే కథ. దేశం కోసం ప్రాణాలు వదిలారని గర్వపడినా.. తమని విడిచి వెళ్లిపోయారనే దుఃఖంలో ఎన్నో ఏళ్లు గడుపుతారు కుటుంబ సభ్యులు. తాజాగా గాల్వన్​ లోయలో అమరుడైన కుందన్​ కుమార్​ కుటుంబసభ్యుల పరిస్థితి కూడా ఇదే. అయితే.. ఇటీవలే జన్మించిన తన కుమార్తెను కుందన్ చూడకుండానే​ మరణించడం అత్యంత విషాదకరమైన వార్త.

ఇచ్చిన హామీ నెరవేర్చకుండానే...

కుందన్​ కుమార్​ ఓజా... ఝార్ఖండ్​లోని దిహారీ గ్రామవాసులు రవి శంకర్​ ఓజా, భవానీ దేవీ రెండో కుమారుడు. చిన్న నాటి నుంచి కుందన్​కు భారత సైన్యం అంటే ప్రేమ. ఆర్మీ దుస్తుల్లో దేశానికి ఎప్పటికైనా సేవ చేయాలని కలలు కనేవారు. ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి వ్యాయామాలు చేసేవారు. తన కలను నెరవేర్చుకుని 2011లో ఆర్మీలో చేరారు.

ఓజాకు ఒకటిన్నరేళ్ల క్రితమే వివాహమయ్యింది. 17 రోజుల క్రితం ఓజా భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో లద్దాక్​​లో విధులు నిర్వహిస్తున్నారు ఓజా. తనకు ఆడబిడ్డ పుట్టిందన్న తీపి కబురును విన్న ఆయన... తన తల్లితో ఎంతో సంతోషంగా మాట్లాడారు. సెలవు దొరికిన వెంటనే.. వచ్చి తన ముద్దుల బిడ్డను చూస్తానని ఆ తల్లికి హామీ కూడా ఇచ్చారు ఓజా.

Ladakh clash: The soldier who will never return home to see his newborn
కుందన్​ కుమార్

కానీ ఓజా.. హామీని ఎప్పటికీ నెరవేర్చలేరు. సోమవారం రాత్రి తూర్పు లద్దాక్​​లోని గాల్వన్​ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘటనలో 28ఏళ్ల కుందన్​ కుమార్​ ఓజా అమరులయ్యారు.

తన కుమారుడు మరణించిన వార్త విన్న కుందన్​ తల్లిదండ్రులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు. జీవితంలో తండ్రిని ఒక్కసారి కూడా చూడలేని పరిస్థితి ఆ ఆడబిడ్డది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.