ETV Bharat / bharat

చైనా సరిహద్దు మరో నియంత్రణ రేఖగా మారుతుందా?

author img

By

Published : Sep 10, 2020, 6:24 PM IST

తూర్పు లద్దాఖ్​లో భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. విభేదాలను తగ్గించటంలో ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. చైనా సరిహద్దు వెంబడి.. పాకిస్థాన్​ నియంత్రణ రేఖ తరహా పరిస్థితులు ఏర్పడే దిశగా పరిణామాలు మారుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

INDIA CHINA
చైనా సరిహద్దు

భారత్​, పాకిస్థాన్​ మధ్య ఉండే నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులు నిత్యం ఉద్రిక్తంగానే ఉంటాయి. 2013లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొన్ని వేల సార్లు ఉల్లంఘనకు గురైంది. ఇరు దేశాల మధ్య శత్రుత్వం కారణంగా అక్కడ ఎప్పుడూ యుద్ధ వాతావరణమే ఉంటుందనేది బహిరంగ సత్యం.

అయితే, వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) ఇందుకు భిన్నం. భారత్​, చైనా పరస్పర అంగీకారంతో దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంది. సరిహద్దుల్లో తుపాకీ వాడకూడదని నియమంగా పెట్టుకున్నారు. గస్తీ నిర్వహించేవారు తుపాకులు వెంట తీసుకెళ్లినా, వాటి బ్యారెళ్లను కిందికి వంచుతారు. అందువల్ల చెదురుమదురు ఘటనలు మినహా హింసాత్మక ఘర్షణలు జరిగేవి కావు.

ఒప్పందాలను విస్మరించి..

కానీ, కొద్ది నెలలుగా ఇక్కడి పరిస్థితులు మారుతున్నాయి. రోజురోజుకీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గల్వాన్​ లోయలో ఇరుదేశాల సైన్యం మధ్య జూన్​లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. తాజాగా భారత్, చైనా సరిహద్దులో 45 ఏళ్ల తర్వాత తొలిసారి తుపాకీ పేలింది. పాంగాంగ్​ సరస్సు దక్షిణ భాగంలోని రెజాంగ్​ లా వద్ద సోమవారం జరిగిన ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఒప్పందాలకు తూట్లు పడ్డాయి.

ఇదీ చూడండి: చైనా సెల్ఫ్​ గోల్- 45 ఏళ్ల తర్వాత పేలిన తూటా

ఇక్కడ మరో విషయం.. చైనా ఆర్మీ (పీఎల్​ఏ) కదలికలు రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఆ సమయంలో బలగాలు, సామగ్రి రవాణా చేస్తే గుర్తించటం కష్టంగా ఉంటుందని ఓ సీనియర్ సైనికాధికారి ఈటీవీ భారత్​కు వివరించారు.

"ట్రక్కులు, భారీ వాహనాలు రాత్రిపూట పాంగాంగ్​ సరస్సు దక్షిణ ఒడ్డులోని పీఎల్​ఏ స్థావరాలకు చేరటం మేం గమనించాం. వ్యూహాత్మక కారణాలతోనే రాత్రివేళల్లో పీఎల్​ఏ రవాణా, కదలికలను ముమ్మరం చేస్తోంది. ఘర్షణలు జరగకముందు వరకు.. ఎల్​ఏసీ వెంబడి రాత్రి పూట కదలికలపై కఠిన నిషేధం ఉండేది."

- సీనియర్ సైనికాధికారి

ఎల్​ఏసీ వెంబడి సుమారు లక్ష మంది బలగాలను ఇరు దేశాలు మోహరించాయి. ఆర్టిలరీ గన్స్, ట్యాంకులు, యుద్ధ విమానాలను రంగంలోకి దించాయి. వై-20 రవాణా విమానాల ద్వారా పారాట్రూపర్లు, భారీ తుపాకులు, వాహనాలను చైనా వేగంగా తరలిస్తున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఇదీ చూడండి: పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సరిహద్దులో ఉద్రిక్తత

ఈ సారి భిన్నంగా..

ఎల్​ఏసీలో స్వల్ప ఉద్రిక్తతలు సాధారణమే అయినా.. చైనా ఈ సారి భిన్నంగా ప్రవర్తిస్తోందని లద్దాఖ్​లో పనిచేసిన మరో సైనికాధికారి వివరించారు.

"ఇలాంటి ఘర్షణ వాతావరణం ఇంతకుముందు కూడా ఉండేది. కానీ, అది ఓ డ్రిల్​ తరహాలో సాగేది. ఇరువైపులా బ్యానర్లు చూపగానే పరస్పరం వెనుదిరిగేవారు. ఇప్పుడేం మారిందో తెలియదు కానీ.. చైనా వెనకడుగు వేసేందుకు నిరాకరిస్తోంది. అందుకే పాకిస్థాన్​ సరిహద్దు పరిస్థితులు ఇక్కడ ఏర్పడుతున్నాయి. చైనా, పాక్​ మధ్య సంబంధాలు, సహకారం ఉండటం మరో చేదు నిజం" అని చెప్పారాయన.

ఇదీ చూడండి: 'పక్కా కుట్రతోనే చైనా సైన్యం కాల్పులు!'

చైనా- పాక్ సంబంధాలు..

తాజా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్​లో సైబర్​, ఎలక్ట్రానిక్​ వార్​ఫేర్​, హైటెక్​ నిఘా సదుపాయాలతో కార్యాలయాన్ని ప్రారంభించింది పీఎల్​ఏ వ్యూహాత్మక సహకార దళం (పీఎల్​ఏఎస్​ఎస్​ఎఫ్​). 2020 మార్చి నుంచి పాక్​ నిఘా విభాగం ఐఎస్​ఐకి చెందిన కల్నల్ స్థాయి అధికారి.. పీఎల్​ఏ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

(రచయిత- సంజీవ్ బారువా)

ఇదీ చూడండి: భారత్​పై ముప్పేట దాడికి డ్రాగన్‌ పన్నాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.