ETV Bharat / bharat

ఇద్దరు ముష్కరులు హతం - ఉగ్రవాదుల మృతి

56 గంటలపాటు సాగిన కుప్వారా ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

కుప్వారాలో ఇద్దరు ముష్కరులు హతం
author img

By

Published : Mar 4, 2019, 12:03 AM IST

జమ్ముకశ్మీర్​లోని కుప్వారా జిల్లా హంద్వారాలో 56 గంటలపాటు సాగిన సుదీర్ఘ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పరిసరాలు అనుకూలించక తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం కష్టతరమయిందని భద్రతా సిబ్బంది పేర్కొంది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా ఒక సాధారణ పౌరుడు మృతి చెందారు.

తనిఖీలు చేస్తున్న పోలీసులపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. చుట్టూ నివాస గృహాలు ఉండటం, ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం ఇరుకుగా ఉన్న కారణంగా ఎన్​కౌంటర్ ఆలస్యమైందని తెలిపారు పోలీసులు.

ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో స్థానికుల్ని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు పంపారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.