ఇప్పటివరకు ఫుడ్ డెలివరీ బాయ్స్ చేరవేసిన ఆహారాన్ని దాదాపు అందరం రుచి చూసే ఉంటాం. కానీ, ఇంటిల్లిపాదికి ఒంటి చేత్తో వడ్డించేది వనితలు.. మరి హోటల్లో వండలేరా..? టంఛనుగా ఫుడ్ డెలివరీ చేయలేరా? అందుకే, మహిళలే కీలక పాత్ర పోషించేలా 'అన్నశ్రీ ఫుడ్ డెలివరీ యాప్'ను రూపొందించారు 'కేరళ కుడుంబశ్రీ ఫుడ్‌కోర్ట్స్' వారు.
త్రిస్సూర్‌లో కుడుంబశ్రీ ఫుడ్ కోర్ట్స్ మహా ఫేమస్. కుడుంబశ్రీ సంస్థ మహిళల అభ్యుదయానికి పెద్దపీట వేస్తోంది. మహిళలు మాత్రమే నిర్వహించే కొన్ని హోటళ్లను వీరు ప్రారంభించారు. ఇప్పుడు అన్నశ్రీ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్‌ను కుడుంబశ్రీతో కలిసి పనిచేస్తున్న స్వయం సహాయక బృందాల మహిళలు నడపడం విశేషం.
మొదట ఈ యాప్‌లో ఆర్డర్ చేసుకున్నవారికి త్రిస్సూర్‌లోని 3 కుడుంబశ్రీ మహిళా ఫుడ్ కోర్ట్‌ల నుంచి .. ఫుడ్ డెలివరీ చేస్తారు మహిళలు. ఈ యాప్‌లో మధ్యాహ్న భోజనం, మినీ కేరళ సాధ్యా, కాంబో మీల్స్, వెజ్, నాన్ వెజ్ అబ్బో ఒక్కటేమిటి.. ఏది ఆర్డర్ చేసినా ఇట్టే ఇంటికి పట్టుకొచ్చేస్తారు ఈ ఫుడ్ డెలివరీ గర్ల్స్..
పైగా ఈ మహిళలు ఆరోగ్యకరమైన వంటకాల తయారీలో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతే కాదు కొవిడ్-19 జాగ్రత్తలూ తు.చ తప్పకుండా పాటిస్తారు. కాబట్టి భయం లేకుండా ఆర్డర్ చేయాలని పిలుపునిస్తున్నారు.
ఇదీ చదవండి:పొట్టకూటి కోసం బుట్టలు అల్లుతున్న లాయర్!