ETV Bharat / bharat

'లాక్​డౌన్​ వేళ పోస్ట్​మెన్​ల సేవలు ప్రశంసనీయం' - భారతీయ తపాలా శాఖ

కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​లో ప్రజలకు సహాయం చేయడానికి భారతీయ తపాలా శాఖ సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాలు, ఔషధాలు వంటివి చేరవేస్తున్నారని కొనియాడారు.

Kudos to th IndiaPostOffice
'లాక్​డౌన్​ వేళ పోస్ట్​మెన్​ల సేవలు ప్రశంసనీయం'
author img

By

Published : Apr 26, 2020, 6:58 AM IST

భారతీయ తపాలా శాఖ, పోస్ట్​మెన్​ల సేవలను ప్రశంసించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతున్న విపత్కర పరిస్థితుల్లో .. నిత్యావసరాలు, ఔషధాలు, నగదును ప్రజలకు చేరవేస్తూ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ చేసిన ట్వీట్​ను జోడిస్తూ.. రీట్వీట్​ చేశారు మోదీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మోదీ ట్వీటీ

"భారతీయ తపాలా శాఖ నెట్​వర్క్​​, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేసేందుకు కష్టపడి పని చేస్తున్న పోస్ట్​మెన్​లకు కృతజ్ఞతలు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇంటి వద్దకే సేవలు..

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతున్న వేళ భారతీయ తపాలా శాఖ సేవలందిస్తోంది. ప్రజల వద్దకే సేవల పేరిట నగదు ఉపసంహరణ సహా.. నిత్యావసరాలు, ఔషధాల వంటి ఇతర సామగ్రిని చేరవేస్తోంది. లాక్​డౌన్​లో ప్రజలకు సాయం అందిస్తోన్న తపాలా సిబ్బందిపై పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసలు కురిపించారు.

ఇదీ చూడండి: వైద్యులు, నర్సులు దేవుడితో సమానం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.