ETV Bharat / bharat

వైద్యులు, నర్సులు దేవుడితో సమానం: మోదీ

కరోనా వైరస్​ నేపథ్యంలో వైద్యులపై జరుగుతున్న దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఎవరైనా వైద్యులను హింసిస్తే.. వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు. విపత్తు పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మన జీవితాలను కాపాడుతున్న వైద్యులు, నర్సులు.. దేవుడితో సమానమన్నారు.

PM MODI APPEALS CITIZENS TO RESPECT DOCOTORS SAYING THEY ARE GODS
వైద్యులు, నర్సులు దేవుడితో సమానం: మోదీ
author img

By

Published : Mar 25, 2020, 7:57 PM IST

Updated : Mar 25, 2020, 9:00 PM IST

వైద్యులు, నర్సులు దేవుడితో సమానం: మోదీ

విపత్తు పరిస్థితుల్లో సేవ చేస్తున్న వైద్యులు, నర్సులు దేవుడితో సమానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వారిపై జరుగుతున్న దాడి.. తనను ఎంతో కలచివేసిందన్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించిన ప్రధాని.. వైద్యులకు సహకరించని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు స్పష్టం చేశారు.

"వైద్యులు మన ప్రాణాలను కాపాడతారు. మనం వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. వుహాన్​లో రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించిన వారికి నేను స్వయంగా లేఖ రాశా. నా దృష్టిలో వారు ఎంతో గొప్ప పని చేశారు. కానీ కొన్ని ప్రాంతాల నుంచి విచారకర సమాచారాలు అందుతున్నాయి. అవి వింటుంటే.. మనసుకు ఎంతో బాధగా ఉంటోంది. దేశప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, సహాయ సిబ్బంది.. ఇలా చాలా మంది దేశానికి సేవ చేస్తున్నారు. వారికి ఏదైనా చెడు జరిగితే.. మీరు ఆ సమయంలో అక్కడే ఉంటే.. ఆ చెడు చేసిన వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరగుతూనే ఉంటాయి అనుకుంటున్నారు. కానీ నేను వీటిని తీవ్రంగా పరిగణిస్తాను. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని హోంశాఖ, అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఆదేశాలిచ్చాను. ఇలాంటి విపత్తు సమయంలో.. ఆసుపత్రుల్లో తెల్ల దుస్తుల్లో కనిపిస్తున్న వైద్యులు, నర్సులు.. ఈశ్వరుడితో సమానం. వీళ్లే మనల్ని మృత్యువు నుంచి కాపాడుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్నారు."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వారిని అదుకోండి...

పండగ వేళ.. తనతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న వారికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. అయితే.. ఆర్థిక శక్తి ఉన్న వారు.. ఈ 21రోజుల పాటు 9 కుటుంబాలను ఆదుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. అదే పండుగకు నిజమైన అర్థమని పేర్కొన్నారు. లాక్​డౌన్​తో జంతువులూ ఇబ్బందులు పడుతున్నాయని.. వాటినీ కాపాడుకోవాలని తెలిపారు.

కరోనా వైరస్​కు సొంతంగా చికిత్స చేసుకోవడం మంచిది కాదన్నారు మోదీ. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా వైరస్​కు వ్యాక్సిన్​ను కనుక్కోలేదని గుర్తుచేశారు. ఇంట్లో నుంచే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.

పిల్లలు భేష్​

వైరస్​పై అవగాహన పెంచడంలో పిల్లలు కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. తమ తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో వారు పంచుకుంటున్న పోస్టులను తాను చూస్తున్నట్టు తెలిపిన మోదీ.. ఒకటి, రెండు రోజుల్లో వాటిపై స్పందిస్తానని వెల్లడించారు.

ఆదర్శంగా నిలవాలి

కరోనాపై పోరులో వారణాసి.. యావత్​ దేశానికే ఆదర్శంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సామాజిక దూరం పాటిస్తూ.. ఇతరుల్లో స్ఫూర్తి నింపాలని కోరారు.

గడ్డు కాలంలో సొంత నియోజకవర్గంలో ఉండాలని.. కానీ దిల్లీలో పరిస్థితుల దృష్ట్యా కుదరలేదని వివరించారు. ఎంత తీరిక లేకుండా ఉన్నా.. వారణాసిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు.

మహాభారత యుద్ధం 18 రోజుల పాటు సాగిందని.. కరోనా మహమ్మారిపై పోరు 21 రోజులు పడుతుందని మోదీ పేర్కొన్నారు. కరోనాపై కచ్చితమైన సమాచారం కొరకు వాట్సాప్​లో హెల్ప్​డెస్క్​ ఏర్పాటు చేసినట్టు మోదీ వారణాసి ప్రజలకు తెలిపారు. ఎలాంటి సందేహాలున్నా.. 9013151515 నంబర్​కు వాట్సాప్​ చేయాలన్నారు.

Last Updated : Mar 25, 2020, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.