ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 'మన్ కీ బాత్'లో నీట్, జేఈఈ పరీక్షల గురించి ప్రస్తావించకపోవటంపై మండిపడ్డారు. మనసులో మాట కార్యక్రమంలో 'పరీక్ష పే చర్చ' చేపట్టాలని విద్యార్థులు కోరుకుంటే.. ప్రధాని అసలు విషయం వదిలి బొమ్మలపై మాట్లాడారని విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహించే రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' పూర్తయిన తర్వాత ఈ మేరకు వ్యాఖ్యానించారు రాహుల్.
-
JEE-NEET aspirants wanted the PM do ‘Pariksha Pe Charcha’ but the PM did ‘Khilone Pe Charcha’.#Mann_Ki_Nahi_Students_Ki_Baat
— Rahul Gandhi (@RahulGandhi) August 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">JEE-NEET aspirants wanted the PM do ‘Pariksha Pe Charcha’ but the PM did ‘Khilone Pe Charcha’.#Mann_Ki_Nahi_Students_Ki_Baat
— Rahul Gandhi (@RahulGandhi) August 30, 2020JEE-NEET aspirants wanted the PM do ‘Pariksha Pe Charcha’ but the PM did ‘Khilone Pe Charcha’.#Mann_Ki_Nahi_Students_Ki_Baat
— Rahul Gandhi (@RahulGandhi) August 30, 2020
" జీఈఈ-నీట్ అభ్యర్థులు ప్రధాని మోదీ పరీక్ష పే చర్చ చేపట్టాలని కోరుకున్నారు. కానీ, ప్రధాని బొమ్మలపై చర్చించారు. మనసులో ఉన్నది కాదు, విద్యార్థుల గురించి మాట్లాడండి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఆదివారం జరిగిన మన్‌కీ బాత్‌లో ప్రపంచానికి బొమ్మల ప్రధాన కేంద్రంగా భారత్‌ను మార్చాలని స్టార్టప్‌లు, యువతకు పిలుపునిచ్చారు మోదీ.
నీట్, జేఈఈ పరీక్షలు సెప్టెంబర్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీం కోర్టుకు వెళ్లారు ఆరు రాష్ట్రాల మంత్రులు. అయితే పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ప్రపంచానికి బొమ్మల హబ్‌గా భారత్: మోదీ