కేరళలో ఓనమ్ పండగను ఎంతో వైభవంగా జరుపుకొంటారు. ఆధ్యాత్మికతతో పాటు క్రీడలకు సమప్రాధాన్యం ఉంటుంది. ఓనమ్ వేడుకల్లో భాగంగా అక్కడ జరిగే పడవ పోటీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అదే తరహాలో కొన్ని ప్రాంతాల్లో 'ఓనతల్లు'.. స్నేహపూర్వక కుస్తీని నిర్వహిస్తారు.
ఓనతల్లు అంటే..
ఓనమ్, తల్లు(పోరు) రెండు పదాల కలయిక. ఈ సంప్రదాయ కుస్తీకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. పాలక్కాడ్ జిల్లా పల్లసాన ఈ కుస్తీకి పుట్టినిల్లు. గతంలో పల్లసాన పాలకుడిని కుతిరవట్టత్తు రాజు చంపేశాడు. ఈ కారణంతో కుతిరవట్టత్తుపై పల్లసాన ప్రజలు యుద్ధానికి దిగారు. ఈ పోరును స్మరించుకుంటూ ఓనతల్లును నిర్వహిస్తారు.
చిన్న నుంచి పెద్ద వరకు..
ఈ కుస్తీలో పాల్గొనేందుకు వయసుకు పరిమితులేమీ ఉండవు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పాల్గొంటారు. ఈ ఆటలో ఇద్దరు పరస్పరం తలపడతారు. ఒక వ్యక్తిని మిగతా వారు పట్టుకుంటారు. ప్రత్యర్థి వెనకనుంచి గట్టిగా కొట్టాలి. ఉరుమినట్టు శబ్దం వస్తే కొట్టినవారు గెలిచినట్లు.. లేదా దెబ్బతిన్న వారు గెలుస్తారు.
మన్నడియార్ ప్రజలు ఈ కుస్తీలను తిరువోనమ్ రోజున ఉత్సవంలా నిర్వహిస్తారు. ఊరుకుడి, ఈళుకుడి ప్రజలు అవిట్టమ్ (ఓనమ్ మూడో రోజు)న జరుపుకొంటారు. దెబ్బలు గట్టిగా తగిలుతున్నా సంప్రదాయాన్ని వదిలిపెట్టలేమని చెబుతున్నారు.
ఇదీ చూడండి: ముంబయి లాల్బాగ్ గణేశ్ నిమజ్జనంలో కోలాహలం