ETV Bharat / bharat

కేరళలో మళ్లీ రికార్డు స్థాయిలో 6,324 కేసులు - కొవిడ్​-19

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 19 వేలు, కేరళలో 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో మొత్తం కేసులు లక్షా 50 వేలు దాటాయి.

Kerala's Covid single day surge crosses 6000;tally breaches 1.50 lakh mark
కేరళలో మళ్లీ రికార్డు స్థాయిలో 6,324 కేసులు
author img

By

Published : Sep 24, 2020, 10:28 PM IST

కేరళలో కరోనా వైరస్​ తీవ్రరూపం దాల్చుతోంది. గురువారం ఒక్కరోజే 6,324 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం. మొత్తం కేసులు లక్షా 53 వేల 456కు చేరుకున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 613 మంది కొవిడ్​కు బలయ్యారు.

మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 19 వేల 164 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల 82 వేల 963 మంది వైరస్​ బారినపడ్డారు.

మరో 459 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 34 వేల 345కు చేరింది.

  • కర్ణాటకలో మరో 7,710 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 65 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 8,331కి చేరింది. కేసులు 5.48 లక్షలు దాటాయి.
  • బంగాల్​లో 3,196 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో ఇవాళ 5,692 కేసులు... 66 మరణాలు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.