ETV Bharat / bharat

కేరళలో కరోనా ఉగ్రరూపం.. 'మహా'లో తగ్గిన ఉద్ధృతి - State wise Covid-19 case in India

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలోనూ 9వేల మందికిపైగా కొవిడ్ బారిన పడ్డారు. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విలయం కొనసాగుతోంది.

Kerala reports highest single day spike of 9,258 new COVID-19
కేరళలో కరోనా ఉగ్రరూపం..మహాలో తగ్గిన కేసులు
author img

By

Published : Oct 2, 2020, 9:33 PM IST

భారత్​లో కొవిడ్​ విస్తరణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. తాజాగా 15,591 మంది కొవిడ్​ బారినపడగా.. 424 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 14 లక్షల 16 వేలు దాటింది.

కరోనా ఉగ్రరూపం

కేరళలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా 9,258 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 12 వేల 499కు చేరింది. తాజాగా మరో 20 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

  • కర్ణాటకలో ఒక్కరోజే 8,793 మంది కరోనా బారిన పడ్డారు. మరో 125 మంది మహమ్మారికి బలయ్యారు.
  • తమిళనాడులో కొత్తగా 5,500 కేసులు వెలుగుచూశాయి. మరో 67మంది మరణించారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 3,946 మందికి వైరస్ సోకగా.. మరో 54 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 4 లక్షల 7 వేలకు చేరువైంది.
  • బంగాల్​లో కొత్తగా 3,310 మందికి పాజిటివ్​గా తేలగా.. మరో 53 మంది మృతి చెందారు.
  • దిల్లీలో తాజాగా 2,920 మంది వైరస్​ బారిన పడగా... 37 మందిని కొవిడ్​ బలిగొంది.

ఇదీ చూడండి: 'ఆత్మనిర్భర్​ భారత్​లో ప్రపంచ సంక్షేమమూ భాగమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.