ETV Bharat / bharat

పారిపోయిన ప్రేమజంట- లాక్​డౌన్ రూల్స్​కు బుక్కైందంట!

ఇంట్లో పెళ్లికి నో చెప్పినందుకు కేరళలో ఓ ప్రేమ జంట పారిపోయి పెళ్లి చేసుకుందామనుకుంది. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇద్దరు మేజర్లే అని నిర్ధరించుకున్నారు. అయితే లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు పోలీసులు.

kerala-lovers-elope
కేరళ ప్రేమికులు
author img

By

Published : Apr 9, 2020, 11:37 AM IST

కేరళలో పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్న ఓ ప్రేమ జంట.. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు బుక్కయ్యింది.

కోజీకోడ్​ తామరసెర్రి ప్రాంతానికి చెందిన ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మతాలు వేరు కావడం వల్ల యువతి కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

తండ్రి ఫిర్యాదు

కూతురు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు యువతి తండ్రి. యువతీయువకులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు మేజర్లు కావడం, స్వచ్ఛందంగానే ఇళ్లు వదిలి వచ్చినట్లు యువతి వాగ్మూలం ఇవ్వడం వల్ల ఇరువురు వెళ్లిపోవడానికి కోర్టు అంగీకరించింది.

లాక్​డౌన్ మరిచారా?

ప్రేమ కోసం పారిపోయిన విషయంలో సానుకూలంగా వ్యవహరించిన కోర్టు.. లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమించినందుకు కన్నెర్రజేసింది. ఇద్దరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు సెక్షన్ 188(ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన), సెక్షన్ 269(ప్రమాదకరమైన వ్యాధి వ్యాప్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం) ప్రకారం ఎఫ్​ఐఆర్ దాఖలు చేశారు పోలీసులు.

ఇలాంటిది జరగలేదండోయ్..

ఇప్పటివరకు రాష్ట్రంలో లాక్​డౌన్​ ఉల్లంఘన కేసులు చాలానే నమోదైనప్పటికీ.. ఇలాంటి ఘటన జరగలేదని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి అత్యవసర కారణమేదీ లేనందున కోర్టు ఆదేశం ప్రకారం కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.