కరోనా వైరస్ భయాందోళనల కారణంగా కేరళ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విధించిన రాష్ట్ర విపత్తు హెచ్చరికను.. ఎత్తివేసింది. 3 వేల మంది అనుమానితులు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కొద్ది రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానందున ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 61 మంది వివిధ ఆస్పత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. భారత్లో ఇప్పటివరకు నమోదైన 3 కరోనా కేసులు కేరళకు చెందినవే.