వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. కేరళలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు పినరయి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అందుకు తిరస్కరించారు. ప్రత్యేక సమావేశాలకు అంత అత్యవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వివరణ సరిగా లేదని అన్నారు.
రైతులకు సంఘీభావంగా బుధవారం ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కేంద్ర చట్టాలకు వ్యతిరేక తీర్మానం చేయాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సీఎం నిర్ణయాన్ని గవర్నర్ తోసిపుచ్చారు. అయితే.. గవర్నర్ నిర్ణయం విచారకరమని ముఖ్యమంత్రి ఆరోపించారు.
కాంగ్రెస్ ఆందోళన..
గవర్నర్ నిర్ణయాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే.. అప్రమత్తమైన పోలీసులు జలఫిరంగులు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. అక్కడే బైఠాయించిన కాంగ్రెస్ నేతలు.. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినదించారు.
![Kerala Guv denies permission to convene session to pass motion against farm bills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9973534_1.jpg)
![Kerala Guv denies permission to convene session to pass motion against farm bills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9973534_2.jpg)
![Kerala Guv denies permission to convene session to pass motion against farm bills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9973534_4.jpg)
![Kerala Guv denies permission to convene session to pass motion against farm bills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9973534_3.jpg)
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడం కేరళలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇదీ చూడండి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం