ETV Bharat / bharat

ప్రొఫైల్ చూసి ప్రేమించింది.. దివ్యాంగుడైనా పెళ్లాడింది

దివ్యాంగుడైన ఓ యువకుడిని ఫేస్​బుక్​లో చూసిన యువతి... అతడిని ప్రేమించి, పెద్దలను ఎదురించి, పెళ్లి చేసుకున్న ఘటన కేరళ త్రిశూర్​లో జరిగింది. ఏంటీ సినిమా కథ అనుకుంటున్నారా? కాదు, ఇది నిజం.

Girl meets paralyzed youth on Facebook, leaves home to marry him
ఫేస్​బుక్ ప్రేమ: దివ్యాంగుడిని వివాహం చేసుకున్న యువతి
author img

By

Published : Mar 6, 2020, 3:27 PM IST

Updated : Mar 6, 2020, 7:32 PM IST

ప్రొఫైల్ చూసి ప్రేమించింది.. దివ్యాంగుడైనా పెళ్లాడింది

ఓ అందమైన యువతి, ప్రమాదవశాత్తు దివ్యాంగుడైన ఓ యువకుడిని ప్రేమించింది. వద్దని వారించిన పెద్దలను ఎదిరించి, చివరికి ఒప్పించి మరీ అతనిని పెళ్లి చేసుకుంది. ఏంటీ సినిమా కథ అనుకుంటున్నారా? కానేకాదు ఇది నమ్మశక్యం కాని ఓ యథార్థగాథ.

కేరళ త్రిశూర్​ జిల్లాలోని తాజెకాడ్​కు చెందిన యువకుడు ప్రణవ్. ఆరేళ్ల క్రితం విద్యార్థిగా ఉన్నప్పుడు బైక్​ ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణమైతే నిలిచింది కానీ తుంటి కింద భాగం మొత్తం చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకే పరిమితమైపోయాడు. ప్రాథమిక అవసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు.

ఆత్మవిశ్వాసం

తన పరిస్థితిని చూసుకొని ప్రణవ్ ఏ​ మాత్రం నిరుత్సాహపడలేదు. ఆత్మవిశ్వాసం కోల్పోయి... నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు తరచుగా వెళుతుండేవాడు. చక్రాల కుర్చీలోనే కూర్చొని పండుగలను ఆస్వాదిస్తుండేవాడు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమ వేదిక ఫేస్​బుక్​లో విపరీతంగా వైరల్ అయ్యాయి.​

అదే సమయంలో తిరువనంతపురానికి చెందిన షహానా... అనుకోకుండా ఓ రోజు ప్రణవ్​ వీడియోలను చూసింది. ఫేస్​బుక్​లోని ప్రణవ్ ఫోన్​ నంబర్​ తీసుకొని అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ప్రణవ్​కు తన ప్రేమను వ్యక్తపరిచిన షహానా.. పెళ్లి ప్రతిపాదన చేసింది.

ప్రేమ ఉన్నా...

ప్రణవ్​ కూడా షహానాను ఇష్టపడినప్పటికీ, తన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వివాహానికి ఒప్పుకోలేదు. అయితే షహానా పట్టు వీడలేదు. చివరికి వారిద్దరూ ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు.

ఈ ప్రేమ వ్యవహారం తెలుసుకొని షహానా కుటుంబం ఒకింత ఆశ్చర్యపోయింది. ఫేస్​బుక్​లో తప్ప స్వయంగా ఎప్పుడూ చూడని ఓ దివ్యాంగుడిని వివాహం చేసుకోవద్దని వారించింది. అయితే.. తన ప్రేమను వదులుకోవడానికి ఇష్టపడని షహానా.. ప్రణవ్​ కోసం ఇళ్లు విడిచి వచ్చేసింది. షహానా చేసిన పనితో ప్రణవ్​ కుటుంబం కూడా ఇబ్బంది పడినా ఇరువురూ భౌతికంగా కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. ఆమె వాస్తవికతను అర్థం చేసుకొని.. తిరిగి ఇంటికి వెళ్లిపోతుందని వారు ఆశించారు.

ప్రేమకు రూపంతో పనిలేదు

ప్రణవ్​ను కళ్లారా చూసిన షహానా అతనినే పెళ్లి చేసుకుంటానని కచ్చితంగా చెప్పేసింది. ప్రేమకు భౌతిక రూపంతో పనిలేదని తేల్చిచెప్పేసింది. దీనితో కొడుంగల్లూర్​లోని ఓ ఆలయంలో మార్చి 3న ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుని ఒక్కటైంది.

ఇదీ చూడండి: వృద్ధి రేటు భయాలతో రూపాయి భారీ పతనం

Last Updated : Mar 6, 2020, 7:32 PM IST

For All Latest Updates

TAGGED:

Marreage
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.