ETV Bharat / bharat

3 నిమిషాల్లో 53 భంగిమలు- చిన్నారి ప్రపంచ రికార్డు​ - yoga records in Kerala

యోగాలో నయా రికార్డు సృష్టించింది ఓ కేరళ విద్యార్థిని. శరీరాన్ని విల్లులా వంచుతూ కేవలం మూడంటే మూడు నిమిషాల్లో 53 ఆసనాలు వేసి అబ్బురపరిచింది. ఐదో తరగతి చదువుతున్న ఈ చిన్నారి భంగిమలకు.. అమెరికా గోల్డెన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కింది.

Kerala Girl Abhigna creates world Record in Yoga
3 నిమిషాల్లో 53 భంగిమలు- చిన్నారి ప్రపంచ రికార్డ్​
author img

By

Published : Oct 11, 2020, 5:18 PM IST

Updated : Oct 11, 2020, 10:54 PM IST

కేరళలో ఓ ఐదో తరగతి విద్యార్థిని యోగాలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 3 నిమిషాల వ్యవధిలో 53 రకాల భంగిమలు ప్రదర్శించి.. అమెరికా గోల్డెన్​​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది అభిజ్ఞ. గూగుల్​ మీట్​ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో.. గత రికార్డు(3నిముషాల్లో 34 ఆసనాలు)ను తిరగరాసిందీ చిన్నారి.

కేరళ చిన్నారి ప్రపంచ రికార్డ్​

అభిజ్ఞ గతంలోనూ.. మదికేరీ(కర్ణాటక), పుదుచ్చేరిల్లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలలో బంగారు పతకాలు కైవసం చేసుకుంది.

Kerala Girl Abhigna creates world Record in Yoga
3 నిమిషాల్లో 53 భంగిమలు

భరతనాట్యంలోనూ..

తన నాలుగేళ్ల ప్రాయం నుంచే తల్లి తేజా కుమారి వద్ద యోగా నేర్చుకోవడం ప్రారంభించిందట అభిజ్ఞ. ప్రస్తుతం ఈ చిన్నారి.. భారత విద్యాభవన్​కు చెందిన వెంకటేశ విద్యాలయంలో శిక్షణ పొందుతోంది. నృత్య విభాగంలో ప్రత్యేక తర్ఫీదు పొందుతున్న ఈ బాలిక.. భరతనాట్యంలోనూ ఆరితేరింది. అంతేకాకుండా నాగిణి నృత్యంలోనూ అభిజ్ఞ వినూత్న ప్రదర్శనలతో అదరగొడుతోంది.

ఇదీ చదవండి: నిమిషంలో 35 యోగాసనాలు- చిన్నారి ప్రపంచ రికార్డు

Last Updated : Oct 11, 2020, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.