దేశంలో లాకికవాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు కేరళ సీఎం పినరయి విజయన్. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో భారతీయులంతా ఏకమై ప్రజాస్వామ్య, లౌకిక వాద విలువలను కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. బంగాల్ సీఎం మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ పంపారు విజయన్.
పౌర చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాక ఆ చట్టాన్ని రద్దు చేయాలని కేరళ అసెంబ్లీ తీర్మానించింది. అధికార సీపీఎం-ఎల్డీఎఫ్ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ తీర్మానానికి మద్దుతు తెలిపాయి. కేరళలో భాజపా ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ దీనిని వ్యతిరేకించారు.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో చక్రం తిప్పనున్న ఎన్సీపీ?