ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మాజీ జవాన్ 'తేజ్ బహదూర్ యాదవ్'ను బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పార్టీల కూటమి తమ వారణాసి అభ్యర్థిగా ప్రకటించాయి. ఈ విషయంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. హరియాణా గడ్డ నుంచి వచ్చిన వ్యక్తి మోదీపై పోటీ చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
-
हरियाणा की मिट्टी में कुछ तो है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
पिछली बार भी हरियाणा वाले ने मोदी जी को वाराणसी में चुनौती दी थी, इस बार भी हरियाणा का जवान मोदी जी को टक्कर देने पहुँचा है।
सपा- बसपा गठबंधन के इस उम्मीदवार को पूरे देश की ओर से ढेरों शुभकामनायें
">हरियाणा की मिट्टी में कुछ तो है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 30, 2019
पिछली बार भी हरियाणा वाले ने मोदी जी को वाराणसी में चुनौती दी थी, इस बार भी हरियाणा का जवान मोदी जी को टक्कर देने पहुँचा है।
सपा- बसपा गठबंधन के इस उम्मीदवार को पूरे देश की ओर से ढेरों शुभकामनायेंहरियाणा की मिट्टी में कुछ तो है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 30, 2019
पिछली बार भी हरियाणा वाले ने मोदी जी को वाराणसी में चुनौती दी थी, इस बार भी हरियाणा का जवान मोदी जी को टक्कर देने पहुँचा है।
सपा- बसपा गठबंधन के इस उम्मीदवार को पूरे देश की ओर से ढेरों शुभकामनायें
" హరియాణా మట్టిలో ఏదో ఉంది. గత ఎన్నికల్లో హరియాణా నుంచి వచ్చిన ఓ వ్యక్తి (అరవింద్ కేజ్రీవాల్) మోదీకి సవాలు విసిరారు. ఇప్పుడూ హరియాణాకు చెందిన ఓ జవాను వారణాసిలో మోదీకి ఎదురు నిలబడ్డారు. దేశం మొత్తం తరఫున ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థికి శుభాకాంక్షలు."
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
హరియాణాలో పుట్టి పెరిగిన కేజ్రీవాల్.... 2014 సాధారణ ఎన్నికల్లో మోదీకి సవాల్ విసురుతూ వారణాసి లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో మోదీ గెలుపొందారు.
మే 19న ఆఖరి విడత పోలింగ్‌లో భాగంగా వారణాసి లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
భారత సరిహద్దు భద్రతా దళంలో విధులు నిర్వర్తించిన యాదవ్‌ను... నాసిరకం భోజనంపై ఫిర్యాదు చేసినందుకు 2017లో విధుల నుంచి తప్పించారు.