దిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు కేజ్రీ. గురువారమే ప్రధానికి ఆహ్వానం పంపినట్లు ఆప్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది 70 స్థానాలకు గాను 62 స్థానాలను కైవసం చేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 16న ఆదివారం.. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పూర్తి స్థాయి మంత్రివర్గం ప్రమాణం చేయనున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించటం లేదని.. ప్రజల సమక్షంలోనే కేజ్రీ ప్రమాణం చేస్తారని ఆ పార్టీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
ఇదీ చూడండి: 'ఎవరికీ ఆహ్వానం లేదు.. ప్రజల మధ్యే కేజ్రీ ప్రమాణం'