దిల్లీ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్.. ఇవాళ సాయంత్రం ముఖ్యనేతలతో విందు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఈ సమావేశం వేదికగా త్వరలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు కేజ్రీ. వచ్చే మూడు నెలల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రాధాన్యతా క్రమాన్ని రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దిల్లీని అంతర్జాతీయ నగరంగా మార్చాలన్న అంశంపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపాయి.
'తప్పనిసరి'ని వెనక్కి తీసుకోండి
అదే సమయంలో ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్‌ను కోరుతూ లేఖ రాశారు భాజపా దిల్లీ విభాగం మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే విజేందర్ గుప్తా. ఈ నిర్ణయం నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందన్నారు. అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం, పరిపాలనపై కేజ్రీవాల్ దృష్టిసారిస్తారన్న విశ్వాసాన్ని కేజ్రీ వమ్ము చేశారని ఆరోపించారు.
'మీరెప్పుడూ ఆలోచించలేదు'
విజేందర్ గుప్తా వ్యాఖ్యలను దిల్లీ అభివృద్ధి కమిషన్ ఛైర్మన్, ఆప్ నేత జాస్మీన్ షా తప్పుబట్టారు. గత ఐదేళ్లుగా దిల్లీ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని, ప్రమాణస్వీకార ఆహ్వానానికి వారు సంపూర్ణ అర్హులని అన్నారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో:హెలికాఫ్టర్‌పై రాకెట్ దాడి.. అందరూ మృతి