యువత ఉగ్రవాదం వైపు మళ్లకుండా జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం.. ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కారణాలతోనూ ముష్కరులు తమ పంథాను మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా సైబర్ గ్రూపుల రిక్రూట్‌మెంట్లపై దృష్టి సారించారు. ఉగ్రవాదం నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల.. ఈ బాటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. యువతను తమ వైపు తిప్పుకునేందుకు ముష్కరులు సైబర్ గ్రూపులను వినియోగించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌లలో వివిధ లింక్‌లను ఉపయోగించి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. అంతేకాకుండా.. భద్రతా దళాలపై నకిలీ వీడియోలు, తప్పుడు కథనాలను సృష్టించినట్లు తేలింది. అధికారులు ఈ తరహా చర్యలపై నిఘా ఉంచడ సహా.. ఉగ్ర సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు సహకరించే దాదాపు 40 మందికి పైగా సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఆ గ్రామంలో పంచాయతీ పెద్దగా పాకిస్థాన్ మహిళ!