జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించే ఆర్టికల్ 370 రద్దుపై నేడు లోక్‌సభలో చర్చ జరగనుంది. జమ్ము కశ్మీర్ పునర్విభజన, రిజర్వేషన్ బిల్లులనూ చర్చకు చేపట్టే అవకాశం ఉంది.
జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లును.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారమే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లును నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి.
ప్రస్తుతానికి బిల్లును ప్రవేశపెడుతున్నామని.. మంగళవారమే సభ పరిశీలిస్తుందని నిన్న స్పష్టం చేశారు షా. సమాధానం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఈ నేపథ్యంలో నేడు దిగువసభలో సుదీర్ఘ చర్చ సాగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో బిల్లు సులువుగానే ఆమోదం పొందనుంది.
ఇదీ చూడండి: కశ్మీర్ అంశంపై నిపుణుల్లో భిన్న స్వరాలు