ETV Bharat / bharat

ఆధ్యాత్మిక కర్తార్​పుర్ నడవా నేడే ప్రారంభం

సిక్కులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా నేడు ప్రారంభం కానుంది. గురునానక్‌ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోనున్నారు. ఈ మేరకు భారత్ వైపున్న కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లా డేరా బాబా నానక్‌ వద్ద నిర్మించిన ప్రయాణికుల టర్మినల్ భవనాన్ని మోదీ ఆరంభిస్తారు.

ఆధ్యాత్మిక కర్తార్​పుర్ నడవా నేడే ప్రారంభం
author img

By

Published : Nov 9, 2019, 5:07 AM IST

ఆధ్యాత్మిక కర్తార్​పుర్ నడవా నేడే ప్రారంభం

సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్.. తన చివరి 18 ఏళ్లను గడిపిన కర్తార్‌పుర్‌ను దర్శించుకోవాలన్న భారతీయ భక్తుల అడ్డుంకులు నేటితో తొలగిపోనున్నాయి. పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్రం నరోవాల్‌ జిల్లాలో ఉన్న దర్బార్‌ సాహిబ్‌ను.. భారత్​లోని పంజాబ్‌ గురుదాస్‌పుర్‌ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్‌ ఆలయాన్ని కలిపే కర్తార్‌పుర్‌ ఆధ్యాత్మిక నడవా నేడు ప్రారంభం కానుంది.

క్రీ.శ.1522 సంవత్సరంలో కర్తార్‌పుర్‌ వద్ద సాహిబ్‌ గురుద్వారాను నెలకొల్పారు గురునానక్‌ దేవ్‌. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకోవడానికి భారత్​లోని సిక్కు మతస్థులు దశాబ్దాలుగా ఎదురుచూశారు. చివరికి వారి నిరీక్షణ ఫలించి.. నడవా నిర్మాణానికి భారత్​-పాకిస్థాన్​లు అంగీకారం తెలిపాయి. అక్టోబర్‌ 24న కారిడార్ నిర్వహణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ నడవా.. భక్తులకు వీసా రహిత ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఈ మేరకు భారత్‌ వైపు నడవాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ... పాక్‌ వైపు కారిడార్‌ను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రారంభించనున్నారు.

ముఖ్యనేతలతో మొదటి బృందం..

కర్తార్‌పుర్‌ ను దర్శించుకునేందుకు 550 మందితో కూడిన భారత ప్రతినిధి బృందం జాబితాను కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు పంపింది. ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేంద్రమంత్రులు హర్‌దీప్‌ సింగ్‌ పురి, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌తో పాటు కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా, దీపేందర్‌ సింగ్‌ హుడా, జితిన్‌ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

సన్నాహాలు పూర్తి...

కారిడార్‌ ప్రారంభోత్సవానికి ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ గురుదాస్‌పుర్‌, కపుర్తలా, అమృత్‌సర్‌ జిల్లాలకు సెలవు ప్రకటించారు. సందర్శకుల భద్రతకు పాక్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 100 మందితో కూడిన పర్యటక పోలీసు దళాన్ని మోహరించింది. ఈ సంఖ్యను మరింత పెంచుతామని వెల్లడించింది పాక్‌ పోలీసు విభాగం. కర్తార్‌పుర్‌లో గురుద్వారా మినహా మరే ప్రాంతానికి వెళ్లకూడదని పాక్‌ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

సమస్యలు తలెత్తినా..

కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా నిర్మాణం నుంచే అనేక సమస్యలు తలెత్తాయి. అయితే, భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, కశ్మీర్ అంశం ఈ కారిడార్‌ నిర్మాణానికి అడ్డు రాలేదు. 1999లో ఇరుదేశాల మధ్య మొదటిసారి ప్రతిపాదనకు వచ్చిన ఈ ఆధ్యాత్మిక నడవా ఎన్నో చర్చల తర్వాత పట్టాలకెక్కింది. రోజుకు 5 వేల మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారని సమాచారం. అయితే కర్తార్‌పుర్‌ను దర్శించుకునే భక్తులకు పాక్​ కొన్ని షరతులు విధించింది.

పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు 20 డాలర్లు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు భారత్‌ తీవ్రంగా అభ్యంతరం తెలిపినా.. దాయాది దేశం వెనక్కి తగ్గలేదు. ప్రారంభ రోజు సహా గురునానక్ జయంతి అయిన నవంబర్‌ 12న రుసుము వసూలు అంశమై ఊగిసలాడింది పాకిస్థాన్. అనంతరం 9, 12 తేదిల్లో కర్తార్​పుర్​ సందర్శించే యాత్రికుల వద్ద నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి వెల్లడించారు.

పాక్​కు ఆర్థిక చేయూత

యాత్రికుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలన్న నిర్ణయంతో కష్టాల్లో ఉన్న పాక్‌ ఖజానాకు నిధులు సమకూరనున్నాయి. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌... అధికారంలోకి రాకముందు గత ప్రధానులు దేశ పర్యటక రంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే దాయాది దేశం కారిడార్‌కు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అందుకే ద్వైపాక్షికంగా భారత్‌తో ఎన్ని సమస్యలున్నా కారిడార్‌ నిర్మాణానికి పాక్‌ కట్టుబడి ఉంది.

కర్తార్‌పూర్ కారిడార్‌ వల్ల... పాక్‌లో మత పరమైన పర్యటకానికి అవకాశాలు కూడా తెరుచుకుంటాయని ఇమ్రాన్ ఖాన్‌ వెల్లడించారు. కేవలం సిక్కులకే కాకుండా.. దేశంలో ఉన్న పలు ఇతర మతాల దర్శనీయ స్థలాలను సందర్శించుకునేందుకు ఆయా మతస్థులు ఆసక్తి చూపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అంతిమంగా పాక్‌ ఆర్థిక రంగానికి ఊతమిస్తాయని ఇమ్రాన్ తెలిపారు.

ఇదీ చూడండి: 'కాషాయం'పై క్లారిటీ ఇచ్చిన సూపర్​స్టార్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Belgrade - 8 November 2019
1. Various of Serbia's Foreign Minister Ivica Dacic and India's Foreign Minister Subrahmanyam Jaishankar walking into room and shaking hands
2. Various of ministers and their delegations meeting
3. Ministers arrive for news conference
4. SOUNDBITE (English) Subrahmanyam Jaishankar, India's Foreign Minister
"I think one of the central aspects of our relationship is that we have always stood with each other and we have extended to each other principal support when it comes to issues of sovereignty and territorial integrity. You all know that we have a long standing position on the Kosovo issue and... I today very much welcome hearing from the foreign minister that Serbia regards issues of... relating to Jammu and Kashmir has been completely the internal matter of India."
5. Cutaway Indian flag
6. SOUNDBITE (English) Subrahmanyam Jaishankar, India's Foreign Minister:
"One issue which both of us are focused on is the need to fight terrorism in all its forms and manifestation, and I think we are in full agreement on the need to strengthen cooperation in the fight against terrorism in all the international forums. This is a global challenge and we believe it requires a global response."
7. Cutaway Serbian flag
8. SOUNDBITE (Serbian) Ivica Dacic, Serbia's Foreign Minister:
"It is very important to us that India has a lot of understanding for our issues and our principal position when it comes to keeping our territorial integrity and sovereignty."
9. Ministers shake hands
STORYLINE:
India's foreign minister on Friday held talks with his counterpart in Belgrade as part of his official visit to Serbia.
Subrahmanyam Jaishankar and Ivica Dacic held talks on improving bilateral relations and cooperation.
After their meeting, Dacis thanked his guest for his government's support for Belgrade's refusal to recognise the independence of its former province, Kosovo.
In turn, Jaishankar thanked his host for Serbia's support for India's actions in the disputed Kashmir region.
In August, India's Hindu-nationalist government stripped disputed Indian Kashmir of its semi-autonomous powers in August and placed the Muslim-majority region under a massive security lockdown.
Authorities have since eased some restrictions, lifting the curfew, removing roadblocks and restoring landlines and some mobile phone services, but other measures remain in place
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.