కరోనా ప్రభావం విద్యా సంస్థలపైనా పడింది. విద్యార్థులకు వైరస్ సోకకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులుంటే విద్యార్థులు, సిబ్బందికి సెలవులివ్వాలని ఆదేశించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.
"విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా పాఠశాల సిబ్బందికి అంటువ్యాధులు ఉన్నట్లైతే వారికి సెలవు ఇచ్చేయాలి. వైద్యులు వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధరించేవరకు వారిని బడికి అనుమతించొద్దు. ఒకవేళ హాస్టల్ విద్యార్థులు అయితే.. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని ప్రత్యేక గదిలో ఉంచాలి."
-ప్రభుత్వ ఉత్తర్వులు
ఆ భయంతోనే...
హైదరాబాద్‌లో కరోనా సోకినట్లు నిర్ధరణ అయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుబాయ్ నుంచి ముందుగా బెంగళూరు వెళ్లారు. అక్కడ అనేక మందిని కలిశారు. ఫలితంగా కర్ణాటకలో కరోనా భయం మరింత ఎక్కువైంది.
"తెలంగాణలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. అతడు జనవరిలో హాంగ్‌కాంగ్ నుంచి వచ్చిన కొంతమందిని దుబాయ్‌లో కలిశాడు. తిరిగి ఫిబ్రవరి 20న బెంగళూరుకు చేరుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఇక్కడ అతడిని కలిసిన 25 మందికి రక్త పరీక్షలు చేసేందుకు నమూనాలు సేకరించాం.'
-సుధాకర్, ఆరోగ్య శాఖ అధికారి