కర్ణాటకలోని హోసకోటె ప్రాంతంలో బిర్యానీ కోసం జనం ఎగబడుతున్నారు. రుచికరమైన బిర్యానీని ఆస్వాదించేందుకు భారీ 'క్యూ'ను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. సూర్యోదయం కాక ముందే ఈ బిర్యానీ సెంటర్ ముందు వాలిపోతున్నారు.
"ఉదయం నాలుగు గంటలకు ఇక్కడికి వచ్చాను. ఆరున్నరకు బిర్యానీ దొరికింది. దాదాపు 1.5 కి.మీ. మేర లైన్ ఉంది. ఈ బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది."
- ఓ కస్టమర్
ఈ బిర్యానీ స్టాల్ను 22 ఏళ్ల క్రితం ప్రారంభించినట్లు యజమాని చెప్పుకొచ్చారు. రోజుకు వెయ్యి కిలోల బిర్యానీని విక్రయిస్తున్నట్లు తెలిపారు. బిర్యానీలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ను కలపడం లేదని అంటున్నారు.
ఇదీ చదవండి- భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 80కి.మీ రిక్షా తొక్కాడు!