ETV Bharat / bharat

హిందూ ఆలయం కోసం ముస్లిం భూదానం - no religious discrimination

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఓ సంఘటన కర్ణాటకలో జరిగింది. ఓ ముస్లిం వ్యక్తి.. హిందూ దేవాలయం కోసం రూ.కోటి విలువ చేసే భూమిని ఉచితంగా అందించాడు. మతమేదైనా.. అందరూ సమానమేనని చాటి చెప్పాడు.

Karnataka Muslim man donates land for Hanuman temple
హిందూ దేవాలయం కోసం.. ముస్లిం వ్యక్తి సాయం
author img

By

Published : Dec 10, 2020, 4:54 PM IST

Updated : Dec 10, 2020, 10:23 PM IST

హిందూ ఆలయం కోసం ముస్లిం భూదానం

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఓ సంఘటన కర్ణాటకలో జరిగింది. హిందూ దేవాలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి రూ.80 లక్షల నుంచి రూ.కోటి విలువ చేసే భూమిని ఉచితంగా అందించారు.

Karnataka Muslim man donates land for Hanuman temple
ఆలయం కోసం భూమిని బహూకరించిన హెచ్​ఎమ్​జీ బాషా

హోసకోట్​ తహసీల్​ కదుగోడిలోని బెలాతుర్​ కాలనీకి చెందిన హెచ్​ఎమ్​జీ బాషా.. తన 1633.63 చదరపు అడుగుల భూమిని వీరాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్​కు ఉచితంగా అందించారు. ఈ ఆలయం.. బెంగళూరు నుంచి చెన్నైకు వెళ్లే జాతీయ రహదారి మధ్యలో ఉంది.

తనకు మందిరమైనా, మసీదు అయినా ఒకలాంటిదేనని చెబుతున్నారు బాషా.

కదుగోడిలోని వీరాంజనేయ స్వామి దేవాలయం

"ఆంజనేయ మందిరంలో సరిపడినంత స్థలం లేక భక్తులు ఇబ్బంది పడుతూ ఉండటం నేను చూశాను. అందుకని నేను నా 1.5 గుంటల స్థలాన్ని ఆలయం కోసం ఉచితంగా ఇచ్చాను. నా కుటుంబ సభ్యులు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ భూమి మీద యాజమాన్య హక్కులను నేను వీరాంజనేయ స్వామి ట్రస్ట్​కు బదిలీ చేస్తాను. నాకు ఎలాంటి మతభేదాలు లేవు. ఈ గుడిలో భక్తులు 30 ఏళ్లకు పైనుంచి పూజలు చేస్తున్నారు. మసీదు కట్టినా, గుడి కట్టినా అంతా ఒకటే. ఇది సమాజానికి ఉపకరిస్తుందని నేను నమ్ముతున్నాను."

--హెచ్​ఎమ్​జీ బాషా

బాషా చేసిన సాయానికి అక్కడి జనమంతా ఎంతో మెచ్చుకుంటున్నారు. ఆయన మంచితనాన్ని తెలియజేస్తూ గ్రామస్థులు.. రహదారి పక్కన పోస్టర్లు ఏర్పాటు చేశారు.

గ్రామస్థులు ఏర్పాటు చేసిన పోస్టర్లు

ఆలయం వద్ద హెచ్​ఎమ్​జీ బాషా మంచితనాన్ని తెలుపుతూ పోస్టర్లు

ఈ భూవిరాళం అందడం ద్వారా రూ.కోటి వ్యయంతో ఆంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు ఆలయ ట్రస్ట్​ నిర్వాహకులు.

ఇదీ చూడండి:'కుతుబ్​ మినార్'​లోని ఆలయాలపై వివాదమేంటి?

Last Updated : Dec 10, 2020, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.