ETV Bharat / bharat

గర్భవతి భార్య సహా కుటుంబాన్ని చంపి ఆత్మహత్య - pregnant wife killed

గర్భవతిగా ఉన్న తన భార్య సహా కుమారుడు, తల్లితండ్రులను తుపాకీతో కాల్చి చంపాడు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే ఈ ఘటనకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు.

గర్బవతి భార్య సహా కుటుంబాన్ని చంపి ఆత్మహత్య
author img

By

Published : Aug 16, 2019, 2:18 PM IST

Updated : Sep 27, 2019, 4:45 AM IST

కర్ణాటక చమరాజ్​నగర్​ జిల్లా గుండ్లుపేట్​లో విషాద ఘటన జరిగింది. తన నాలుగేళ్ల కుమారుడిని, గర్భవతిగా ఉన్న భార్యను, తల్లిదండ్రులను తుపాకీతో నుదిటిపై కాల్చి చంపాడు ఓ వ్యక్తి. ఆపై తాను గొంతులో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

అప్పులు, వ్యాపారంలో నష్టాల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రకాశ్​ భట్టాచార్య మనస్తాపంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

మైసూరుకు చెందిన ఓం ప్రకాశ్.. గురువారం సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గుండ్లుపేట్​లోని రిసార్టుకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 3గంటలకు సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​'సంబంధిత పిటిషన్లపై సుప్రీం విచారణ వాయిదా

Intro:ABody:BConclusion:C
Last Updated : Sep 27, 2019, 4:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.