ETV Bharat / bharat

ఆ సీఎం సలహాదారు ఆత్మహత్యాయత్నం! - Yediyurappa grand nephew NR Santosh

కర్ణాటక సీఎం రాజకీయ సలహాదారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మాకర స్థితిలోకి వెళ్లిన ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

Karnataka CM's political secretary hospitalised after alleged suicide attempt
ఆ సీఎం సలహాదారు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Nov 28, 2020, 11:34 AM IST

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప రాజకీయ సలహాదారు, బంధువు ఎన్​ఆర్​ సంతోశ్​ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు తీసుకొని బలవన్మరణానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. బెంగళూరు డాలర్స్​ కాలనీలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న సంతోశ్​ను.. కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలిసిన యడియూరప్ప.. సంతోశ్​ను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. సంతోశ్​ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు సీఎం.

యడియూరప్ప వ్యక్తిగత సహాయకునిగా కొంతకాలం పనిచేసిన సంతోశ్.​. ఈ ఏడాది మే నుంచి రాజకీయ సలహాదారునిగా నియమితుడయ్యారు. అయితే.. ముఖ్యమంత్రి అంతర్గత వర్గాల్లోని కొందరితో విబేధాల కారణంగా.. సంతోశ్​ తన పదవికి రాజీనామా చేయొచ్చనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సంతోశ్​ ఆత్మహత్యాయత్నం చేసుకోడవం గమనార్హం.

ఇదీ చదవండి: కొరవడిన ఆనాటి ప్రమాణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.