ఫిబ్రవరి 6న మంత్రివర్గ విస్తరణ చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి వచ్చి భాజపా తరపున గెలిచిన 10 ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 13 మందిని తన మంత్రి వర్గంలోకి తీసుకొనున్నట్లు వెల్లడించారు.
బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టు నమునాను పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 6న రాజ్భవన్లో ఉదయం 10.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేసారు.
కర్ణాటక మంత్రివర్గంలో మొత్తం 34 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 18 మంది మాత్రమే యడియూరప్ప క్యాబినేట్‌లో ఉన్నారు. మరో 16 మందికి అవకాశం ఉండగా...తాజాగా మంత్రివర్గం విస్తరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆశావాహుల జాబితా ఎక్కువగా ఉండటం వల్ల యడియూరప్పకు మంత్రివర్గ విస్తరణ కత్తిమీద సాములా మారింది.
ఇదీ చదవండి: 'ఆశల పద్దు' అందరిని ఆనంద పరిచేనా?