మాదక ద్రవ్యాలు సేవించిన ఓ మహిళ రాత్రి సమయంలో నగ్నంగా ద్విచక్రవాహనాన్ని నడిపిన ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. క్లబ్ రోడ్ నుంచి చెన్నమ్మ రహదారిలో స్నేహితుడితో కలసి వెళ్తున్న మహిళ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఏపీఎంసీ మార్కెట్ వద్ద స్నేహితుడిని వదిలేసిన ఆ మహిళ... నగ్నంగానే హిందలగ రోడ్ వైపు దూసుకెళ్లింది.
తన మిత్రబృందంతో పందెం కట్టడమే ఈ వ్యవహారానికి కారణమని సమాచారం. రెండు రోజుల క్రితం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి: రెండో పెళ్లి వద్దన్నారని 75ఏళ్ల వరుడి ఆత్మహత్య