ETV Bharat / bharat

'అవును నేను అదే.. ప్రజలే నా యజమానులు!'

మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు భాజపా ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా. మాజీ ముఖ్యమంత్రి తనను 'కుక్క' అని అన్నారని సింథియా ఆరోపించారు.

Scindia_Kamal Nath
'అవును నేను కుక్కనే.. ప్రజలే నా యజమానులు!'
author img

By

Published : Nov 1, 2020, 7:45 AM IST

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్​నాథ్ తననుద్దేశించి 'కుక్క' అన్నారంటూ భాజపా ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ఆరోపించారు. మధ్యప్రదేశ్​లోని శాడోరాలో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారసభలో సింథియా ఆ ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు.

" కమల్​నాథ్​ ఇక్కడకు వచ్చి నన్ను 'కుక్క' అని సంబోధించారు. అవును నేను అదే. ప్రజలే నా యజమానులు. కుక్క ఎప్పుడూ తన యజమానిని కాపాడుకుంటుంది" అని సింథియా వ్యాఖ్యానించారు.

సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. కాగా ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

గతంలోనూ కమల్​నాథ్​ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి, భాజపా అభ్యర్తి ఇమార్తి దేవిని 'ఐటమ్' అని అన్నారు. దీంతో మోడల్​ కోడ్​ను పలుమార్లు ఉల్లంఘించిన కారణంగా కమల్​నాథ్​ 'ముఖ్య ప్రచారకర్త' స్టేటస్​ను తొలగించింది ఎన్నికల కమిషన్.​

ఇదీ చదవండి:హోల్‌సేల్‌ మద్యం షాపుల్లో ఆ యాప్‌ వాడాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.