ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్.. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై స్పందించారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు, భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులు అరికట్టేందుకు వైద్య రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సూచించారు. అంతేకాకుండా నీటి సంక్షోభంపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు.
" ప్రస్తుతం నెలకొన్న కోరనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా పని చేస్తూ.. కేంద్రానికి సహకరించడం అభినందనీయం. ఇలాగే ఒక ప్రయాణంగా మారి.. నీటికోసం ఎప్పటినుంచో జరుగుతున్న యుద్ధాలను అధిగమించడంలో సహకరించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. కాలుష్యం, వలసదారుల కష్టాలు, మహిళల భద్రత, మతపరమైన హింస, వైద్య సంరక్షణ మొదలైన ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవాలని అభిలాషిస్తున్నా.
కమల్ హాసన్, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు
భారత్ చివరి సారిగా యుద్ధం చేసి అర్ధ శతాబ్దం అయ్యిందని, ప్రస్తుతం వైద్య సంరక్షణ విషయంలో నిత్యం పోరు సాగించాల్సి వస్తోందని పేర్కొన్నారు కమల్. సరైన వైద్యం లేక ఏటా సుమారు 1.6 మిలియన్ల మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం వైద్య సంరక్షణ కోసం ప్రత్యేకమైన బడ్జెట్‌ను.. తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
-
Re imagining India for post-Covid World pic.twitter.com/3dF7Z21a41
— Kamal Haasan (@ikamalhaasan) April 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Re imagining India for post-Covid World pic.twitter.com/3dF7Z21a41
— Kamal Haasan (@ikamalhaasan) April 20, 2020Re imagining India for post-Covid World pic.twitter.com/3dF7Z21a41
— Kamal Haasan (@ikamalhaasan) April 20, 2020
'గ్రీన్ ప్లస్ రివల్యూషన్' అవసరం...
సరిహద్దుల బయట నుంచి పొంచి ఉన్న ముప్పు కంటే.. దేశంలోనే అసలైన ప్రమాదం దాగి ఉందన్నారు కమల్. అంతేకాకుండా వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించాలంటే భారత్‌కు 'గ్రీన్ ప్లస్ రివల్యూషన్'(హరితవిప్లవం) అవసరమని పేర్కొన్నారు.
అలా చేస్తే ఆదాయమూ పెరుగుతుంది...
భారత్‌లో ఉన్న అసంఘటిత కార్మికులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని కమల్ సూచించారు. ఇలా చేయడం వల్ల వారు వృద్ధి చెందడమే కాకుండా.. ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం వస్తుందని తెలిపారు. మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా వారికీ మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు.
" మహిళలంటే ఇంట్లో గృహిణిగానే పరిగణించే సంస్కృతికి స్వస్తి పలికే రోజు రావాలి. ఇళ్లలో పని చేసుకునే మహిళలకు ఉద్యోగాలు కల్పించాలి. వారికి కనీస పొదుపు కూడా ఉండదు. అలాంటి వారికి ఆసరా కల్పిస్తే.. కష్ట కాలంలో వారు పొదుపు చేసుకున్న ధనమే ఉపయోగపడుతుంది".
కమల్ హాసన్, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు
దేశంలో పేదరికం ఇప్పటికీ అత్యంత క్లిష్టమైన సవాలుగా ఉందని కరోనా రుజువు చేసినట్లు కమల్ పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభంలో ధనికులూ దెబ్బతింటారని.. కానీ వారు ఆకలితో చనిపోరని తెలిపారు. నాయకులు పేదవాడి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలనే విషయంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని వివరించారు.