మక్కల్ నీది మయ్యమ్ కార్యకర్తలు, అభిమానులు సంయమనంతో వ్యవహరించాలని ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ కోరారు. తమిళనాడు తిరుచి ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడిపై ఆయన ఈమేరకు స్పందించారు.
"నాకు ఎలాంటి భయంలేదు. కానీ రాజకీయాల్లో నాణ్యత లోపిస్తోంది. తీవ్రవాదులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. చరిత్ర చూస్తే అన్ని మతాల నుంచి వచ్చిన తీవ్రవాదులు కనిపిస్తారు. నేను అదే చెప్పాలనుకున్నా. 'మేం ఆ పనులు చేశామని..' ఎవరూ ఒప్పుకోరు. మంచివాళ్లమనే భావిస్తారు."
-కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యమ్ అధినేత
"గాడ్సే మొదటి తీవ్రవాది" అని ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపైనా కేసులు, నిరసనలపై కమల్ స్పందించారు. అరెస్టులకు తాను భయపడబోనని స్పష్టంచేశారు. తనను అరెస్టు చేస్తే మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని వ్యాఖ్యానించారు. అయితే... ఇది హెచ్చరిక కాదని, సలహా మాత్రమేనని చెప్పారు కమల్.
ఇదీ చూడండి: దేశంలో మొదటి ఉగ్రవాది హిందువే: కమల్