ధర్మం, భక్తి, జ్ఞానం, సదాచారాలకు సంబంధించిన కథలు వినేందుకు, చదివేందుకు ప్రజలు ఇప్పటికీ ఇష్టపడతారు. అలా ఎక్కువమంది చదివేందుకు అమితంగా ఇష్టపడే పత్రికల్లో ఒకటి.. గీతాప్రెస్ ప్రచురించే కల్యాణ్ పత్రిక. 1926లో గోరఖ్‌పూర్‌లో ప్రారంభమైంది గీతాప్రెస్. అప్పటినుంచి, 92 ఏళ్లలో కల్యాణ్ పత్రిక 1102 ముద్రణలతో రికార్డు సృష్టించింది. కవర్‌పేజీలపై ముద్రించే దేవతల అరుదైన బొమ్మలు ఈ పత్రికకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
"మొదటి ప్రచురణ 1926లో ముంబయిలోని వెంకటేష్ ప్రెస్ ముద్రించింది. గోరఖ్‌పూర్‌లో గీతాప్రెస్ ఏర్పాటు చేసిన తర్వాత, ఇక్కడి నుంచే పంపిణీ ప్రారంభమైంది. శ్రీశివ మహాపురాణం పేరుతో 94వ పత్రిక ప్రచురితమైంది. 2017లో, 2018లో రెండు భాగాలుగా దీన్ని ముద్రించాం".
- గీతాప్రెస్ ట్రస్టీలు.
బ్రిటిష్ కాలం నుంచే
1926లో జయదయాల్ గోయెంకా, హనుమాన్ ప్రసాద్ పొద్దార్ గీతాప్రెస్ ప్రారంభించారు. కల్యాణ్ పత్రిక ఎడిటర్‌గా రాధేశ్యామ్ ఖెంకా, ట్రస్టు ఛైర్మన్, పబ్లిషర్‌గా దేవీదయాళ్ అగర్వాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బ్రిటిష్ కాలంలోనే పత్రిక ప్రచురణ ప్రారంభమైంది. మొదట్లో ముద్రణకే ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ పత్రిక ప్రస్తుతం నెలకు 2 లక్షల కాపీలు అమ్ముడవుతోంది. దేశంలోని ప్రతి మూలకూ పోస్ట్ ద్వారా ఈ పత్రిక చేరుతోంది.
విదేశాల్లోనూ సుపరిచితమే
1940 దశకంలో హిందూ మహాసభల వాణిని కళ్యాణ్ వినిపిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం పతాకస్థాయికి చేరుకుంది. కొద్దికాలం తర్వాత రామనామ జపాన్ని పత్రిక నిషేధించింది. పాఠకుల ఉత్తరాలు ప్రచురించేవారు. రామనామ జపం వల్ల తమకు కలిగిన ప్రయోజనాల గురించి ప్రజలు ఉత్తరాల్లో చెప్పేవారు. రామాయణంపై పరీక్షలు కూడా నిర్వహించేది కల్యాణ్ పత్రిక. నాలుగు భాగాల్లో హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందే వరకూ ప్రచారం నిర్వహించింది కల్యాణ్. ఇప్పటికీ ప్రజల్లో విశేష ఆదరణ చూరగొంటున్న కల్యాణ్ పత్రిక దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లోనూ సుపరిచితమే.
ఇదీ చదవండి:సుపరిపాలన, అభివృద్ధి కొనసాగింపుగా జేడీయూ మేనిఫెస్టో