ETV Bharat / bharat

కలైమామణి డాక్టర్ ఆర్‌బీఎన్‌ కన్నుమూత - కలైమామణి డా.ఆర్‌బీఎన్‌

కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్‌ కలైమామణి డా.ఆర్‌బీఎన్‌(59) కన్నుమూశారు. అనారోగ్యంతో 20 రోజులుగా తమిళనాడు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Kalaimamani Dr.RBN  dead in MGM hospital due to health problems
కలైమామణి డాక్టర్‌ ఆర్‌బీఎన్‌ కన్నుమూత
author img

By

Published : Oct 19, 2020, 6:48 AM IST

కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్‌, కమ్మరత్న, కలైమామణి డా.ఆర్‌బీఎన్‌ (59) కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయన 20 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆర్‌బీఎన్‌ తెలుగు రాష్ట్రాల్లోని కమ్మ సేవా సంఘాల కార్యక్రమాల్లో అనేక సార్లు పాల్గొన్నారు. నాలుగు భాషల్లో పండితునిగా, మంచి వక్తగా కీర్తి గడించారు. తమిళనాడు ప్రభుత్వ పురస్కారం 'కలైమామణి'ని అందుకున్నారు.

తెలుగు వ్యక్తి అయినా తమిళంలో పండితునిగా మారి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో ఓ సందర్భంలో 'నీ పాదాలకు నమస్కారాలు' అని చెప్పించుకున్న ఘనత ఆయన సొంతం. ఆర్‌బీఎన్‌ తిరువళ్లూర్‌ జిల్లా పళ్లిపట్టు సమీపంలోని వేణుగోపాలపురంలో రాఘవులనాయుడు, పద్మావతమ్మ దంపతులకు జన్మించారు. 1981లో యశోదను వివాహం చేసుకున్నాక చెన్నైలో స్థిరపడ్డారు. ఆర్‌బీఎన్‌ మృతికి ఆంధ్రప్రదేశ్‌ కాకతీయ సేవా సమాఖ్య తదితర సంస్థల ప్రతినిధులు సంతాపం తెలిపారు.

ఇదీ చూడండి: అసోం- మిజోరం సరిహద్దు ప్రజల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.