ETV Bharat / bharat

అటార్నీ జనరల్​గా కె.కె వేణుగోపాల్​ పునర్నియామకం

భారత అటార్నీ జనరల్​ గా కె.కె.వేణుగోపాల్​ను పునర్నియమించింది కేంద్రం. మంగళవారంతో వేణుగోపాల్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సొలిసిటర్​ జనరల్​గా తుషార్​ మెహతాను కూడా నియమించారు.

K K Venugopal reappointed Attorney General for one year
అటార్నీ జనరల్​గా కె.కె వేణుగోపాల్​ పునర్నియామకం
author img

By

Published : Jun 30, 2020, 5:58 AM IST

భారత అటార్నీ జనరల్​గా సీనియర్ న్యాయవాది​ కె.కె.వేణుగోపాల్​ను పునర్నియమిస్తూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏజీ మూడేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీనితో కేంద్రం మరో ఏడాది పాటు ఆయనను ఏజీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వేణుగోపాల్​ను మరో మూడేళ్లపాటు ఏజీగా కొనసాగించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినా... వయోభారం దృష్ట్యా ఏడాది కాలం మాత్రమే కొనసాగుతానని ఆయన తెలిపారు.

కె.కె.వేణుగోపాల్​ భారత అటార్నీ జనరల్​గా పునర్నియమకం కావడంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. 2020 జులై 1 నుంచి సంవత్సరం పాటు విధులు నిర్వహించనున్నారు వేణుగోపాల్​. మాజీ అటార్ని జనరల్​ ముకుల్​ రోహత్గి స్థానంలో 2017 జూన్​ 30న వేణుగోపాల్​ పదవీ బాధ్యతలు చేపట్టారు.

సొలిసిటర్​ జనరల్​ నియామకం..

సొలిసిటర్ జనరల్​గా తుషార్​ మెహతాను కూడా పునర్నియమించారు. ఈ మేరకు నియామకాల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. తుషార్ మెహతా మూడేళ్ల పదవీ కాలం గడువు ముగిసిపోనుంది. దీంతో జులై 1 నుంచి మరో మూడేళ్లపాటు పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. అంతే కాకుండా మరో ఐదుగురు అదనపు సొలిటర్​ జనరళ్లను కూడా మరో మూడేళ్లు పాటు పునర్నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.

ఇదీ చూడండి: రేపు సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.