ETV Bharat / bharat

'భిన్నాభిప్రాయాలపై జాతి వ్యతిరేక ముద్ర తగదు'

ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రయోగించి భిన్నాభిప్రాయాన్ని అణచివేసే ప్రయత్నం.. భయాన్ని పెంపొందిస్తుందన్నారు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ డి.వై. చంద్రచూడ్​. విరుద్ధ అభిప్రాయాలపై జాతి వ్యతిరేక ముద్ర వేయడం తగదని హితవు పలికారు. వైరుద్ధ్యం అన్నది బలహీనత కాదని.. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించగల సమర్థత భారత్​కు ఉందన్నారు. అదే దేశ బలమని పేర్కొన్నారు.

Justice DY Chandrachud
'భిన్నాభిప్రాయాలపై జాతి వ్యతిరేక ముద్ర తగదు'
author img

By

Published : Feb 16, 2020, 5:30 AM IST

Updated : Mar 1, 2020, 12:01 PM IST

భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి రక్షక కవాటం వంటిదని, విరుద్ధ అభిప్రాయాలపై జాతి వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక ముద్రలు వేయడం తగదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ డి.వై.చంద్రచూడ్​ వ్యాఖ్యానించారు. ఈ ధోరణి.. రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని, వివేకశీల ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించాలని పెట్టుకున్న లక్ష్యాలను దెబ్బతీస్తుందన్నారు.

గుజరాత్​లోని అహ్మాదాబాద్​​లో జస్టిస్​ పి.డి దేశాయ్​ స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రచూడ్​. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రయోగించి భిన్నాభిప్రాయాన్ని అణచివేసే ప్రయత్నం భయాన్ని పెంపొందిస్తుందని.. సమన్యాయ పాలన సూత్రాన్ని అతిక్రమించడానికి, రాజ్యాంగం కాంక్షించిన భిన్నత్వ సమాజ స్థాపన దార్శనికత నుంచి తప్పుదారి పట్టడానికి అనువైన పరిస్థితులనూ కల్పిస్తుందన్నారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి, ప్రశ్నించడానికి ఉన్న అవకాశాలను దెబ్బతీస్తే.. అది రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక పునాదులను ధ్వంసం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ సావధానపూర్వక చర్చలు జరిగేలా చూడటం అత్యవసరమని పేర్కొన్నారు.

జస్టిస్ డి.వై.చంద్రచూడ్​

"ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యాలు అల్పసంఖ్యాక గొంతులను అణచివేయవు. తుది నిర్ణయం తీసుకోవాల్సింది సంప్రదింపులు, ఏకాభిప్రాయంతోనే తప్ప.. సంఖ్య ఆధారంగా కాదు."

- జస్టిస్ డి.వై.చంద్రచూడ్​

దేశం.. విస్తారమైన వైవిద్యంతో అలరారాలని కాంక్షించిందే తప్ప, దాన్ని వదిలించుకోవాలని కాదని... భారత్​పై ఏ వ్యక్తికీ, వ్యవస్థకూ గుత్తాధిపత్యం లేదని స్పష్టం చేశారు జస్టిస్​ చంద్రచూడ్​.

ఇదీ చూడండి: త్వరలో త్రివిధ దళాల తొలి సంయుక్త నిర్వహణ కేంద్రం!

Last Updated : Mar 1, 2020, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.