దిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులపై దాడికి సంఘీభావంగా ముంబయి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన చేపడుతున్న వారిని ఆజాద్ మైదానానికి తరలించారు పోలీసులు. గేట్ వే ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిరసనకారులు ఆ ప్రాంతాన్ని వీడని నేపథ్యంలో బలవంతంగా ఆజాద్ మైదానానికి చేర్చారు. రాత్రంతా గేట్‌వే, తాజ్ హోటల్ వద్ద గుమిగూడి నిరసనలు చేపట్టారు. బాలీవుడ్ నటులు అనురాగ్ కశ్యప్, స్వరా భాస్కర్, విశాల్ దడ్లానీ ఆందోళనలో పాల్గొన్నారు.
బాలీవుడ్ గీతాలతో
జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి నిరసనగా ఐఐటీ బాంబే, టీఐఎస్ఎస్, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రధామంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు హోరెత్తాయి. బాలీవుడ్ చిత్రాల్లోని గీతాలను తమ నినాదాలుగా మలుచుకున్నారు విద్యార్థులు.
కట్టుదిట్టమైన భద్రత
ఆందోళనలు ఉద్ధృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇదీ చూడండి: మూడు వేల మంది ఒకేసారి సంగీతం ఆలపిస్తే..?