జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఈ నెల 5న దాడి, విధ్వంసం చోటుచేసుకున్న సమయంలో వాట్సాప్ బృందాన్ని సృష్టించి అల్లర్లకు కారణమైన 37 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు. ఈ విద్యార్థులు ఎవరికీ వామపక్షాలతో సహా ఏ పార్టీకి సంబంధంలేదని వెల్లడించారు. యూనిటీ ఎగెనెస్ట్ లెఫ్ట్ పేరుతో సృష్టించిన ఈ వాట్సాప్ బృందం తమ పరిశీలనలో ఉందని పోలీసులు తెలిపారు.
అనుమానితులు
వర్సిటీ విధ్వంసానికి కారణంగా జేఎన్‌యూ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్ సహా 9 మంది విద్యార్ధులను అనుమానితులుగా గుర్తించినట్లు దిల్లీ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.
పోలీసులు స్పందించలేదు
దాడి జరిగిన సమయం కంటే ముందే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఓ బృందం సంచరిస్తుండడంపై ముందే సమాచారం ఇచ్చినా పోలీసులు సరిగా స్పందించలేదని జేఎన్‌యూ విద్యార్ధి సంఘం ఆరోపించింది. దాడికి ఏబీవీపీ విద్యార్ధి సంఘం కారణమని ఆరోపించింది.
దర్యాప్తు చేయాలి
కాంగ్రెస్ కూడా ఈ జేఎన్‌యూ ఘటనపై విమర్శలు గుప్పించింది. విశ్వవిద్యాలయ ఉప కులపతి జగదీశ్ కుమార్, దిల్లీ పోలీసు కమిషనర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. దాడి ఘటనపై స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు జరిపించాలని ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'చమురు ధరల పెరుగుదలపై ఆందోళన అవసరం లేదు'