ETV Bharat / bharat

మంటల్లో పూర్తిగా కాలిపోయిన మాజీ మంత్రి ఇల్లు - kashmir crime news

జమ్ముకశ్మీర్​ రాంబన్​​లోని మాజీ మంత్రి నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఇల్లు మొత్తం కాలిపోయింది.

No loss of life reported in fire at former minister's house in Kashmir
జమ్మూకాశ్మీర్​ మాజీ మంత్రి నివాసంలో అగ్నిప్రమాదం
author img

By

Published : Nov 16, 2020, 9:08 AM IST

Updated : Nov 16, 2020, 9:28 AM IST

జమ్ముకశ్మీర్​ మాజీ మంత్రి, అప్నీ పార్టీ ఉపాధ్యక్షుడు అజాజ్ చౌధరీ​​ నివాసంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను పసిగట్టిన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికొచ్చి త్రుటిలో ప్రాణాలు రక్షించుకున్నారు. సమాచారం అందుకొని ఘటనా స్థలికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో సుమారు రూ.రెండు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. రాంబన్​​​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

No loss of life reported in fire at former minister's house in Kashmir
కాలిపోతున్న మంత్రి ఇల్లు

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్​ సమస్యలు తలెత్తుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

మంటల్లో పూర్తిగా కాలిపోయిన మాజీ మంత్రి ఇల్లు

ఇదీ చూడండి: '2019తో పోలిస్తే మరింత తీవ్రంగా దిల్లీ కాలుష్యం'

Last Updated : Nov 16, 2020, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.