ETV Bharat / bharat

ఐదుగురు లష్కరే తోయిబా అనుచరుల అరెస్టు - జమ్ము కశ్మీర్ లష్కరే తొయిబా న్యూస్

ఐదుగురు లష్కరే తోయిబా అనుచరులను జమ్ముకశ్మీర్ భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర సంస్థ కార్యకలాపాలు పెంచడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Sopore: Jammu and Kashmir police and security forces arrested five Lashkar-e-Taiba aides in Sopore.
ఐదుగురు లష్కరే తొయిబా అనుచరుల అరెస్టు
author img

By

Published : Jan 9, 2021, 9:07 PM IST

జమ్ముకశ్మీర్​లో ఐదుగురు లష్కరే తోయిబా అనుచరులను పోలీసులు, భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నాయి. బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో వీరిని అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

సోపోర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్​లో వీరు పట్టుబడ్డారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సోపోర్​లో లష్కరే తొయిబా ప్రాబల్యాన్ని పెంచేందుకు ఈ ఐదుగురు కీలకంగా వ్యవహరిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

ఐదుగురిపై సోపోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: చైనా జవానును అదుపులోకి తీసుకున్న సైన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.