పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ పుంఛ్ జిల్లాలో సరిహద్దు వెంబడి భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులు జరిపింది పాక్ సైన్యం. ఈ ఘటనలో ఓ జూనియర్ కమిషనర్ అధికారి మృతి చెందారు.
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణరేఖ వెంబడి మోర్టార్ షెల్స్‌తో పాక్ దాడులకు పాల్పడింది. పాక్ చర్యకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి