ఉగ్రవాదులను రాష్ట్రం దాటిస్తూ అరెస్టయిన జమ్ముకశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్కేసులో పూర్తి ఆధారాలను సేకరించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ బృందం పలు ప్రాంతాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు.
అరెస్టయిన నిందితులను విచారించాక ఎన్‌ఐఏ అధికారులు పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించేందుకు దక్షిణ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
జనవరి 11న ఇద్దరు ఉగ్రవాదులను జమ్ములోయ నుంచి తరలిస్తూ దక్షిణ కశ్మీర్‌లోని ఖాజీగుండ్ జాతీయ రహదారిపై డీఎస్పీ దేవిందర్ సింగ్ పట్టుబడ్డారు.
డీఎస్పీ దవీందర్తో పాటే హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన సయ్యద్ నవీద్, రఫీ అహ్మద్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 23న నవీద్ సోదరుడు సయ్యద్ ఇర్ఫాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: నిర్బంధంలో ఉన్న నలుగురు కశ్మీర్నేతలు విడుదల