ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఏర్‌వేస్‌కు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో అన్ని అంతర్జాతీయ విమానసర్వీసులను గురువారం రద్దు చేసింది జెట్ ఏర్వేస్. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) బుధవారం నుంచి జెట్ ఏర్‌వేస్‌కు ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
బకాయిలు చెల్లించలేదంటూ ఈ సంస్థకు చెందిన బోయింగ్ విమానాన్ని ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం వద్ద యూరోపియన్ కార్గో సర్వీసెస్ జప్తు చేసింది. అద్దె చెల్లించకపోవడం వల్ల ఇప్పటికే 119 విమానాల్లోని మూడో వంతు విమానాశ్రయాల్లోనే నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: ఎన్నికల బాండ్లపై రేపే సుప్రీం తీర్పు