ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్​, టీ షర్ట్స్​ ధరించటం నిషేధం! - Jeans, T-shirt banned for govt officials in Gwalior

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో జీన్స్​, టీషర్ట్స్​ ధరించటంపై నిషేధం విధించారు మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ డివిజన్​ కమిషనర్​. గౌరవప్రదమైన వస్త్రధారణలో రావాలని ఆదేశించారు. ఆదేశాలను ధిక్కరిస్తే.. క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

wearing T-shirt, jeans to office
ప్రభుత్వాధికారులు, సిబ్బంది జీన్స్​, టీ షర్ట్స్​ ధరించటం నిషేధం!
author img

By

Published : Aug 1, 2020, 5:50 AM IST

Updated : Aug 1, 2020, 9:41 AM IST

ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది వస్త్రధారణపై ఆంక్షలు విధించారు మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్ డివిజన్​ కమిషనర్ ఎంబీ ఓజా​. ఫార్మల్​గా​, గౌరవప్రదమైన దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని ఆదేశించారు. కార్యాలయాల్లో జీన్స్​, టీ షర్ట్​లు ధరించటాన్ని నిషేధించారు. ఆదేశాలను విస్మరించే వారిపై క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అశోక్​ నగర్​ జిల్లాలో పర్యటించిన క్రమంలో సమావేశానికి అదనపు కలెక్టర్​ సహా సీనియర్​ అధికారులు జీన్స్​ వేసుకుని రావటం ప్రభుత్వ అధికారుల వస్త్రధారణపై వివాదానికి దారితీసినట్లు చెప్పారు ఓజా. ఈ నేపథ్యంలో దుస్తులపై ఆంక్షలు విధిస్తూ డివిజన్​ అధికారులు, కలెక్టర్లకు లేఖ రాశారు.

జులై 20న దృశ్యమాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందసౌర్​ జిల్లా మెజిస్ట్రేట్​ టీ షర్ట్​ వేసుకుని హాజరుకావటంపై రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: తాళ్లతో లాక్కెళ్లి కరోనా మృతుడి అంత్యక్రియలు!

Last Updated : Aug 1, 2020, 9:41 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.