ETV Bharat / bharat

కన్నడనాట భాజపా - జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం? - JDS

కర్ణాటకలో భాజపా-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందనే సరికొత్త ఊహాగానాలు ఊపందుకున్నాయి. జేడీఎస్​ నేత, రాష్ట్ర పర్యటక మంత్రి సారా మహేశ్ భాజపా నేతలతో భేటీ అవడమే ఇందుకు కారణం. అయితే అలాంటిదేమీ లేదని ఇరువర్గాలు స్పష్టం చేశాయి. ఇది కేవలం యాదృచ్ఛిక భేటీ అని ప్రకటించాయి.

కన్నడనాట భాజపా - జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం?
author img

By

Published : Jul 12, 2019, 6:02 AM IST

Updated : Jul 12, 2019, 7:58 AM IST

కన్నడనాట భాజపా - జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం?

కన్నడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రంతో.. కుమారస్వామి సర్కారు నిలుస్తుందో లేదో అని రోజురోజుకు మరింత ఆసక్తి నెలకొంటోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ రావ్​, పార్టీ సీనియర్​ నేత కేఎస్​ ఈశ్వరప్పతో జేడీఎస్​ నేత సారా మహేశ్​ గురువారం భేటీ అయ్యారు. ఈ తరుణంలో రాష్ట్రంలో జేడీఎస్​-భాజపా సంకీర్ణ ప్రభుత్వం నెలకొనబోతోందా? అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఇది యాదృచ్ఛిక భేటీ...

అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సాధారణ భేటీ అని ఇరు వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్​తో కూడిన సంకీర్ణ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున కార్యచరణ జరుగుతోందని... అయినా వాటన్నింటికీ దీటుగా సమాధానమిస్తామని ట్వీట్​ చేశారు. మరోవైపు యడ్యూరప్ప కూడా జేడీఎస్​తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని గతంలోనే తేల్చి చెప్పారు.

ముంబయికి తిరుగు పయనం

14 మంది కాంగ్రెస్​-జేడీఎస్​ నేతలు రాజీనామాలు చేసిన కారణంగా కుమారస్వామికి కంటిమీద కునుకులేకుండా పోయింది. సుప్రీం ఆదేశాలతో గురువారమే స్పీకర్​ ఫార్మాట్​లో రాజీనామాలు సమర్పించిన రెబల్​ ఎమ్మెల్యేలు అనంతరం బెంగుళూరు నుంచి ముంబయికి తిరిగి వెళ్లిపోయారు.

తొందరపాటు నిర్ణయం తీసుకోను

ఎమ్మెల్యేల రాజీనామాలపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోనని స్పీకర్​ రమేశ్​​ కుమార్​ స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ విధానాల ప్రకారం రాజీనామాలు స్వచ్ఛందంగా, సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ తరుణంలో కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వంపై నెలకొన్న సందేహాలు తీరాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

నేటి నుంచి శాసనసభ సమావేశాలు

తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తమ పార్టీ శాసనసభ్యులకు విప్‌ జారీ చేసింది. ఆర్థిక బిల్లుల ఆమోదానికి వీలుగా కాంగ్రెస్‌ శాసనసభ్యులంతా సభకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. గైర్హాజరయ్యే సభ్యులపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది.

AP Video Delivery Log - 2300 GMT News
Thursday, 11 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2259: Bangladesh Monsoon AP Clients Only 4220073
Refugee camps in Bangladesh hit by floods
AP-APTN-2252: US IL Immigration Rally Must credit WFLD; No access Chicago, No use US Broadcast networks; No re-sale, re-use or archive 4220072
US activists rally ahead of planned immigration raids
AP-APTN-2238: US CA LA Police Homeless AP Clients Only 4220071
LAPD chief: homelessness a 'humanitarian crisis'
AP-APTN-2230: US Trump Census AP Clients Only 4220070
Trump drops citizenship question from census
AP-APTN-2215: Finland Heavy Metal Knitting AP Clients Only 4220069
No stitch up - Finland hosts heavy metal knitting champs
AP-APTN-2209: US Trump Social Media AP Clients Only 4220068
Trump hails social media, slams 'fake news'
AP-APTN-2117: Mozambique Guterres AP Clients Only 4220065
UN chief arrives in cyclone-hit Mozambique
AP-APTN-2116: Sudan Arrests No access Sudan 4220064
At least 16 officers held in Sudan coup attempt
AP-APTN-2103: US OH Deer Rescue Must credit 'TOLEDO POLICE DEPARTMENT' 4220062
Police in US rescue fawn from busy interstate
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 12, 2019, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.