ETV Bharat / bharat

కూటమి సర్కారు కూలింది.. మరి తర్వాతేంటి?

కర్ణాటకలో కుమారస్వామి సర్కారు కూలిపోయింది. మరి తర్వాతి సంగతేంటి? ప్రభుత్వ ఏర్పాటు దిశగా భాజపా అడుగులు వేస్తోంది.. అయితే సీఎం అభ్యర్థిగా యడ్యూరప్పనే పార్టీ నిర్ణయిస్తుందా ? మరి రాజీనామాలు చేసిన 15 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారిపై చర్యలుంటాయా?

author img

By

Published : Jul 24, 2019, 5:38 AM IST

Updated : Jul 24, 2019, 8:13 AM IST

కూటమి సర్కారు కూలింది.. మరి తర్వాతేంటి?
కూటమి సర్కారు కూలింది.. మరి తర్వాతేంటి?

దక్షిణాదిలో తొలిసారిగా భాజపా అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కర్ణాటక. అయితే భాజపా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం స్థిరంగా ఉండకపోవటం... ముఖ్యమంత్రులు మారడం ఇక్కడ సాధారణమే. 14 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ భాజపాకు అత్యధిక స్థానాలు వచ్చినా.... అధికారం చేపట్టేందుకు అవసరమైన 113 సీట్లను సాధించలేకపోయింది.

అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా భాజపా నుంచి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టినా.... అది మూణ్నాల్ల ముచ్చటే అయింది. సభలో బలం నిరూపించుకోలేక రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ వేగంగా పావులు కదిపి జేడీఎస్ కు మద్దతు తెలిపి కుమారస్వామిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది.

అయితే 14 నెలల సంకీర్ణ సర్కారు.. చిట్టచివరికి 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో విశ్వాసపరీక్షలో ఓడి కూలిపోయింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి పదవికి కుమార స్వామి రాజీనామా చేశారు. లేఖను గవర్నర్ వాజుభాయ్ వాలాకు అందజేశారు. ఆయన వెంటనే రాజీనామా ఆమోదించి... కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.

యడ్యూరప్పనే వరిస్తుందా?

ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్న భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం లాంఛనం కానుంది. భాజపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం శాసన సభలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.

రెబల్స్​ సంగతేంటి?

ఇక రాజీనామాలు చేసిన సభ్యుల సంగతి ఏమిటనేది ఆసక్తికర అంశం. వారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఆగ్రహంతో ఉంది. పార్టీ ఫిరాయింపుల చట్టం క్రింద వారిపై అనర్హత వేటు వేసే దిశగా పావులు కదుపుతోంది. మంగళవారం నాడు బలపరీక్ష సందర్భంగా సీఎల్పీ నేత సిద్ధరామయ్య, మంత్రి శివకుమార్ రెబల్స్​పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల బట్టి చూస్తే కాంగ్రెస్ కు చెందిన 12, జేడీఎస్ కు చెందిన ముగ్గురు సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉంది.

కొత్త ప్రభుత్వం ఏర్పడే లోపే ఆ పని చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 15 మంది ఎమ్మెల్యేలు తమ పదవులు కోల్పోతారు. అంతేకాక ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. బలపరీక్ష ఎదుర్కొనే క్రమంలో రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు, మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. వారు ససేమిరా అనడం వల్లే సర్కారు కూలిందని కాంగ్రెస్​ ఆగ్రహంగా ఉంది. కనుక వీరిపై వేటు తప్పకపోవచ్చు.

బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు...

విశ్వాసపరీక్షలో కుమారస్వామి సర్కారుకు సహకరించకుండా అసెంబ్లీకి గైర్హాజరైన బీఎస్పీ ఎమ్మెల్యేపై పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎన్​ మహేశ్​ను పార్టీ నుంచి బహిష్కరించారు.

AP Video Delivery Log - 2200 GMT News
Tuesday, 23 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2145: US FL Trump Mueller Analysis AP Clients Only 4221819
Former US prosecutor on Mueller hearing
AP-APTN-2145: US Senate 9 11 Responders AP Clients Only 4221818
US Senate backs bill to extend 9/11 victims' fund
AP-APTN-2128: US AZ Wildfire Must credit ABC15 Arizona for entire video; No access Phoenix, Tucson, Yuma; No use US broadcast networks; No re-sale, re-use or archive 4221817
Air and ground crews battle Arizona wildfire
AP-APTN-2106: US VA Transgender Bathroom AP Clients Only 4221816
US transgender bathroom ban case back in court
AP-APTN-2103: US MA Cape Cod Tornado US: Part Must credit ‘WCVB’/No access Boston/No re-use, no re-sale or archive/ part must credit "Cape Cod Times" 4221815
Tornado touches down on Cape Cod
AP-APTN-2032: US NY Avenatti AP Clients Only 4221813
Avenatti: Trump aims DOJ at political enemies
AP-APTN-2020: Argentina Lima Group 2 AP Clients Only 4221812
Lima Group asks nations to condemn Maduro govt
AP-APTN-2018: US Trump Lawsuit NY Taxes AP Clients Only 4221811
Trump sues House panel, NY to protect tax returns
AP-APTN-2018: US Senate Leaders AP Clients Only 4221809
US Republicans downplay Mueller testimony
AP-APTN-2018: US House Schiff Mueller Preview AP Clients Only 4221808
US House Intel Chair ready for Mueller testimony
AP-APTN-2018: UK Scotland Johnson Reaction AP Clients Only 4221810
Pro-Scottish independence supporters protest Johnson
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 24, 2019, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.